Begin typing your search above and press return to search.

10 లక్షలు రిజిస్టర్... మిస్టీరియస్ డ్రోన్ లపై వైట్ హౌస్ కామెంట్స్!

రాత్రిపూట ఆకాశవీధిలో మిరుమిట్లు గొలుపుతూ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కనిపించడంపై తీవ్ర చర్చ జరుగుతుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   18 Dec 2024 5:28 AM GMT
10 లక్షలు రిజిస్టర్... మిస్టీరియస్ డ్రోన్ లపై వైట్ హౌస్ కామెంట్స్!
X

న్యూజెర్సీ సహా అమెరికా ఈశాన్య రాష్ట్రాలపై ఎగురుతున్న గుర్తు తెలియని డ్రోన్లు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇవి స్థానికంగా తీవ్ర కలకం రేపుతున్నాయని అంటున్నారు. వీటిపై ట్రంప్ కూడా తనదైన శైలిలో స్పందించారు. ఈ నేపథ్యంలో... గుర్తు తెలియని డ్రోన్ల వ్యవహారంపై తాజాగా శ్వేత సౌధం స్పందించింది.

అవును... న్యూజెర్సీతో పాటు అమెరికా ఈశాన్య రాష్ట్రాలపై ఎగురుతున్న గుర్తు తెలియని డ్రోన్లు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాత్రిపూట ఆకాశవీధిలో మిరుమిట్లు గొలుపుతూ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కనిపించడంపై తీవ్ర చర్చ జరుగుతుందని అంటున్నారు. కొంతమంది వీటిని ఏలియన్స్ తో ముడిపెడుతూ స్పందించారు.

వీటిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్... అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో అమెరికా ప్రభుత్వానికి తెలుసని వ్యాఖ్యానించారు. ఇంకొంతమందైతే.. మిస్సైన్ రేడియో యాక్టివ్ జెర్మేనియాన్ని వెతుతుకుతున్నారనే సంచలన సందేహాలనూ వ్యక్తపరిచారని అంటున్నారు. ఈ సమయంలో స్పందించిన వైట్ హౌస్... ఈ డ్రోన్ లను చూసి భయపడాల్సిన పని లేదని తెలిపింది.

ఈ సందర్భంగా స్పందించిన వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ ప్రతినిధి జాన్ కిర్బీ... ఈ డ్రోన్ లను తాము విశ్లేషించామని.. వీటిల్లో వాణిజ్య, లా ఎన్ ఫోర్స్ మెంట్, ఫ్లైట్స్, హెలీకాప్టర్స్.. కొన్ని సందర్భాల్లో నక్షత్రాలను కూడా ప్రజలు తప్పుగా భ్రమించి డ్రోన్లుగా భావించారని అన్నారు. వీటిల్లో ప్రజా భద్రతకు ముప్పును గుర్తించలేదని అన్నారు.

ఇదే సమయంలో... ఈ అనుమానాస్పద డ్రోన్ లకు సంబంధించి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ) కు సుమరూ ఐదు వేల ఫిర్యాదులు వచ్చయని జాన్ కిర్బీ వెల్లడించారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి.. వీటితో ఎలాంటి ముప్పూ లేదని గుర్తించినట్లు తెలిపారు! ఇదే సమయంలో.. అమెరికాలో సుమారు 10 లక్షల రిజిస్టర్ డ్రోన్లు ఉన్నాయని చెప్పారు.