Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్... ఏపీలో ఆ కీలక అంశాల్లో శ్వేత పత్రాలు!

అవును... ఏపీలో కొత్త ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   24 Jun 2024 5:07 AM GMT
హాట్  టాపిక్... ఏపీలో ఆ కీలక అంశాల్లో శ్వేత పత్రాలు!
X

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులతోపాటు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపైనా ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నట్లు కనిపిస్తుండగా.. మరిన్ని కీలక విషయాల్లో ఈ రోజు కేబినెట్ భేటీలో నిర్ణయాలు తీసుకోబోతున్నారని.. ఇందులో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై శ్వేత పత్రాలు విడుదల చేయనున్నారని తెలుస్తుంది.

అవును... ఏపీలో కొత్త ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీనీ తూచ తప్పకుండా అమలుచేయడం ఎంత ముఖ్యమో.. గత ప్రభుత్వంలో జరిగిన కథాకమీషులన్నీ ప్రజల ముందు ఉంచడం కూడా అంతే ముఖ్యం అన్నట్లుగా భావిస్తుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో... సీఎంగా బాధ్యతలు తీసుకున్న అనంతరం చంద్రబాబు చేసిన ఐదు సంతకాలకు నేడు కేబినెట్ ఆమోదం తెలపనుందని తెలుస్తుంది. ఇదే సమయంలో వాలంటీర్ల వ్యవస్థతో పాటు అమరావతి, పోలవరం విషయాలపైనా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని అంటున్నారు.

వీటితోపాటు ప్రధానంగా... శ్వేతపత్రాల విషయంలో నిర్ణయాలు తీసుకోనున్నారని అంటున్నారు. ఈ మేరకు సుమారు ఎనిమిది అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయింతీసుకుంది! ఈ శ్వేతపత్రాల రూపకల్పనపై మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారని అంటున్నారు. ఈ మంత్రుల కమిటీలో నలుగురు మంత్రులు ఉండనున్నట్లు తెలుస్తుంది.

ఇందులో భాగంగా... ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ తో పాటు హోమంత్రి అనిత, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రెవిన్యూ స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ లు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో ప్రధానంగా లిక్కర్ పాలసీ, ఇసుక పాలసీ, హౌసింగ్ స్కీం మొదలైన అంశాలపై శ్వేతపత్రాలు ఉంటాయని అంటున్నారు. దీంతో... ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.