Begin typing your search above and press return to search.

తిరుపతి తొక్కిసలాటలో మరణించిన వారెవరు? ఎక్కడివారు?

వారు తిరుపతిలోని ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 Jan 2025 7:39 AM GMT
తిరుపతి తొక్కిసలాటలో మరణించిన వారెవరు? ఎక్కడివారు?
X

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనం కోసం వేలాది మంది భక్తులు తిరుపతికి రావటం.. టీటీడీ జారీ చేసే టోకెన్ల కోసం గంటల కొద్దీ సమయం వేచి ఉండటం.. గేట్లు ఒక్కసారి ఓపెన్ చేయటంతో టోకన్లను తొందరగా చేజిక్కించుకోవాలన్న ఆత్రుతతో భక్తులు పరుగులు తీయటం.. గేట్ల వద్ద ఒత్తిడి పెరిగి.. తొక్కిసలాటకు కారణం కావటం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో పోలీస్ లు అదుపు చేయలేకపోయారు . దీంతో.. ఆరుగురు భక్తులు మరణించగా.. పెద్ద ఎత్తులో గాయపడ్డారు. వారు తిరుపతిలోని ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు.

స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. తొక్కిసలాట వేళ.. తమ వారిని కాపాడుకునేందుకు భక్తులు పడిన పాట్లు అన్ని ఇన్ని కావు. కళ్ల ముందు ప్రాణాలు కోల్పోయిన తమ వారి కోసం కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. సంతోషంగా స్వామి వారి దర్శనం కోసం తిరుపతికి వస్తే.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన ఈ వైనం తిరుమల చరిత్రలో ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

తొక్కిసలాటలు చోటు చేసుకోవటం.. భక్తులు అవస్థలు పడటం మామూలే అయినా.. ఇలా ప్రాణాలు పోగొట్టుకోవటం గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదని చెబుతున్నారు. ఇక.. ప్రాణాలు కోల్పోయిన వారెవరు? ఎక్కడి వారు? అన్నది చైస్తే.. వీరిలో నలుగురు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కాగా ఇద్దరు తమిళనాడుకు చెందిన వారు. అయితే.. మరణించిన వారి వివరాల విషయంలోనూ కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. కొన్ని మీడియా సంస్థలు ఏపీకి చెందిన వారు ఐదుగురిగా.. కర్ణాటకకు చెందిన వారు ఒకరిగా చెబుతున్నారు.

అయితే.. ప్రాణాలు కోల్పోయిన ఆరుగురిలో ముగ్గురు విశాఖపట్నానికి చెందిన వారు కాగా.. ఒకరు నరసరావుపేటకు చెందిన వారు. మరో ఇద్దరు తమిళనాడుకు చెందిన వారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.

1. లావణ్య స్వాతి 937) తాటిచెట్లవారి పాలెం, విశాఖపట్నం

2. శాంతి (35) కంచరపాలెం, విశాఖపట్నం

3. రజని (47) మద్దెలపాలెం, విశాఖపట్నం

4. నిర్మల (45) పొల్లచ్చి, తమిళనాడు

5. మల్లిగ (50) మేచారి గ్రామం, సేలం జిల్లా, తమిళనాడు

6. బాబు నాయుడు (51) రామచంద్రపురం, నరసరావుపేట