Begin typing your search above and press return to search.

ఆ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏపీ డిప్యూటీనే టాప్!

ఎవరికి ఎంత మంది ఫాలోవర్స్ ఉంటే.. నెట్టింట వారికి అంత క్రేజ్ ఉన్నట్లు చెబుతుంటారు.

By:  Tupaki Desk   |   17 Sep 2024 3:22 PM GMT
ఆ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏపీ డిప్యూటీనే టాప్!
X

ఈ డిజిటల్ యుగంలో నెట్టింట ఫాలోయింగ్ అనేది ఆయా పొలిటిషీయన్, సినిమా స్టార్, స్పోర్ట్స్ స్టార్ మొదలైనవారి లెవెల్ కు ఇప్పుడు వన్ ఆఫ్ ది పరామీటర్ గా మారిన సంగతి తెలిసిందే. ఎవరికి ఎంత మంది ఫాలోవర్స్ ఉంటే.. నెట్టింట వారికి అంత క్రేజ్ ఉన్నట్లు చెబుతుంటారు.

ఈ క్రమంలో జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా సోషల్ మీడియా ఫాలోవర్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు! ఈ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ ప్లేస్ లో ఉన్న పొలిటీషియన్స్ లో ట్విట్టర్ ఫాలోవర్స్ లో ఎవరు టాప్ ప్లేస్ లో ఉన్నారనేది ఇప్పుడు చూద్దాం..!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏపీ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ముగ్గురు పొలిటీషియన్స్ ని పరిగణలోకి తీసుకుంటే... వీరిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ట్విట్టర్ లో 5.8 మిలియన్ల మంది ఫాలోవర్లతో టాప్ ప్లేస్ లో ఉన్నారు. సినిమాల్లో పవర్ స్టార్ గా భారీ ఫాలోయింగ్ ఉన్న పవన్... రాజకీయ నాయకుడిగా మారిన క్రమంలో ఫాలోయింగ్ మరింత పెరిగిందనే చెప్పాలి!

ఇక పవన్ కల్యాణ్ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ప్రస్తుతం బాబుకు 5.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఈ జాబితాలో మూడోప్లేస్ లో బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ ఉన్నారు. ఈయనకు ఎక్స్ లో 4.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఆ తర్వాత స్థానాల్లో వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, నారా లోకేష్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇందులో భాగంగా... 2.8 మిలియన్ల మంది ఫాలోవర్స్ తో వైఎస్ జగన్ నాలుగో స్థానంలో ఉండగా.. ఒక మిలియన్ ఫాలోవర్స్ తో నారా లోకేష్ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటీవల సోషల్ మీడియాలో ఫాలోవర్స్ బాగా పెరిగారని అంటున్నారు. ఈ క్రమంలో 574కే ఫాలోవర్స్ తో ఆయన ఈ జాబితాలో ఆరో ప్లేస్ లో కొనసాగుతున్నారు.