Begin typing your search above and press return to search.

చంద్రబాబు చాయిస్ : కొత్త డీజీపీగా ఆయన ?

ఇక కూటమి అధికారంలోకి రావడంతోనే ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావుని నియమించారు.

By:  Tupaki Desk   |   4 Jan 2025 3:44 PM GMT
చంద్రబాబు  చాయిస్ : కొత్త డీజీపీగా ఆయన ?
X

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హయాంలో పనిచేసిన వారు అంతా పక్కకు వెళ్లారు. వైసీపీ పాలనలో జగన్ గౌతం సవాంగ్ కి మొదట చాన్స్ ఇచ్చారు. ఆ తరువాత రాజేంద్ర నాధ్ రెడ్డిని అపాయింట్ చేశారు.

ఇక కూటమి అధికారంలోకి రావడంతోనే ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావుని నియమించారు. ఆయన ఆర్టీసీ ఎండీగా అప్పటికి ఉన్నారు. దాంతో పాటు ఆయన సీనియారిటీ సిన్సియారిటీని దృష్టిలో పెట్టుకుని కూడా డీజీపీని చేశారు.

ఇక జనవరి నెలాఖరుకు ద్వారకా తిరుమలరావు రిటైర్ కాబోతున్నారు. ఐపీఎస్ అధికారులకు ఎక్స్ టెన్షన్ ఇచ్చి సర్వీసుని పొడిగించడం కుదరదు. దాంతో కొత్త డీజీపీని నియమించాల్సి ఉంది. ఇదిలా ఉంటే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు మదిలో సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ పేరు ఉందని ప్రచారం సాగుతోంది. 1991 బ్యాచ్ కి చెందిన ప్రతాప్ సమర్థవంతుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు.

ఇదిలా ఉంటే మాదిరెడ్డి ప్రతాప్ దివంగత నేత ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్సార్ కి అత్యంత ఇష్టుడిగా పేరు తెచ్చుకున్నారని చెబుతారు. వైఎస్సార్ సీఎం గా ఉనన్ టైం లో ఏపీ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోడు సీఈవోగా నియమించారు.

ఏపీకి ఆనాడు గూగుల్ క్యాంపస్ ని హైదరాబాద్ కి తీసుకుని రావడంతో ఎంతో కృషి చేశారు. ఉన్నత విద్యావంతుడిగా మాదిరెడ్డి ప్రతాప్ కి పేరు ఉంది. అంతే కాదు తనకు అప్పగించిన పోస్టింగులలో నూరు శాతం ఆయన పనితీరు చూపిస్తారు అని అంటారు.

ఇక జగన్ పాలనలో మాత్రం మొదట్లో మాదిరెడ్డి ప్రతాప్ పట్ల సానుకూలంగా ఉన్నా ఆ తరువాత మాత్రం ఆయనకు సరైన పోస్టింగ్ దక్కలేదు అని ప్రచారంలో ఉంది. చంద్రబాబు సీఎం అయ్యాక కీలకమైన ఫైర్ సర్వీసెస్ డీజీగా మాదిరెడ్డి ప్రతాప్ ని నియమించారు. ఇక ఆయన బుడమేరు వరదల సమయంలో చేసిన విశేష కృషి విధి నిర్వహణలో చూపించిన అంకిత భావానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా ఇంప్రెస్ అయ్యారని చెబుతారు.

దాంతో ఆయనకే కొత్త డీజీపీగా అపాయింట్మెంట్ అన్నది ఖరారు అవుతుంది అని అంటున్నారు. అయితే సీనియర్ల జాబితాలో హరీష్ కుమార్ గుప్తా, పీఎస్ఆర్ ఆంజనేయులు, , కేవీఆర్ ఎన్ రాజేంద్రనాధ్ రెడ్డి, నలిన్ ప్రభాత్, మహేష్ దీక్షిత్, అమిత్ గార్గ్ వంటి వారు ఉన్నారు.

అయితే బాబు మాత్రం కొత్త డీజీపీగా మాదిరెడ్డి ప్రతాప్ పేరుని కన్ ఫర్మ్ చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కొత్త సీఎస్ గా విజయానంద్ ని నియమించారు. డీజీపీగా మాదిరెడ్డి ప్రతాప్ కి చాన్స్ ఇవ్వడం ద్వారా పాలనను పూర్తి స్థాయిలో పరుగులు పెట్టించాలని చూస్తున్నారు అని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే కనుక కొత్త డీజీపీ మాదిరెడ్డి ప్రతాప్ అవుతారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.