Begin typing your search above and press return to search.

ఎవరీ కాండ్రు శ్యామ్ కుమార్? అతడి దాడి ఎందుకంత షాకింగ్ గా మారింది?

పాత వివాదం సమిసిపోయిందన్న ఉద్దేశంతో అవినాశ్ మాటల్ని నమ్మిన శ్యామ్.. అతడ్ని కలిసేందుకు మరో స్నేహితుడితో కలిసి కంచికచర్ల శివసాయి క్షేత్రం వద్దకు వెళ్లారు.

By:  Tupaki Desk   |   4 Nov 2023 4:33 AM GMT
ఎవరీ కాండ్రు శ్యామ్ కుమార్? అతడి దాడి ఎందుకంత షాకింగ్ గా మారింది?
X

కాండ్రు శ్యామ్ కుమార్ అనే యువకుడి మీద జరిగిన దాడి ఉదంతం ఏపీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారటమే కాదు.. ఒక ప్రైవేటు గొడవ రాజకీయ రంగు పులుముకోవటం.. ప్రభుత్వంతో ఏ మాత్రం సంబంధం లేని కొందరు కుర్రాళ్లు చేసిన అతి.. వారు పాల్పడిన దాడికి కొత్త అర్థాల్ని తీసిన వైనం విస్మయానికి గురి చేసేలా మారింది. ఇలాంటి ఉదంతాల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తారన్న విషయాన్ని చేతలతో చూపించటం కనిపిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో రాజకీయ ప్రమేయం ఏ మాత్రం లేకపోవటం.. అధికారపార్టీకి సంబంధం లేని ఈ ఉదంతం ఇప్పుడు పొలిటికల్ ఇష్యూగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. ఈ ఉదంతంలో అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సింది మాత్రం యువకుడి మీద దాడి చేసి.. అమానుషంగా వ్యవహరించిన తీరును మాత్రం తప్పనిసరిగా ఖండించాల్సిదే. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన కాండ్రు శ్యామ్ కుమార్ అనే యువకుడిపై ఆరుగురు కుర్రాళ్లు దాడి చేసిన వైనం.. దాడి సందర్భంగా అతడ్ని హింసించిన ఉదంతంలో షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. అయితే.. శ్యాం సామాజిక వర్గాన్ని ఒకవైపు.. అతడిపై దాడి చేసిన వారి సామాజిక నేపథ్యాన్ని లింకు పెడుతూ.. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ వస్తున్న కథనాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇంతకూ ఇంత పెద్ద దాడికి కారణం ఏమిటన్నది చూస్తే.. శ్యామ్ కు అన్న వరస అయ్యే అవినాష్ పంచాయితీగా చెప్పాలి. ఇప్పుడు అతగాడు విదేశాలకు వెళ్లిపోయాడు. అతనికి హరీశ్ రెడ్డి అనే కుర్రాడికి మధ్య ఒక అమ్మాయి విషయంలో గొడవ నడిచింది.

సదరు వివాదంలో కలుగజేసుకన్న శ్యామ్.. వారిద్దరికి అప్పట్లో సర్ది చెప్పాడు. ఇదంతా ఏడాది క్రితం జరిగింది. అప్పట్లో జరిగింది మనసులో పెట్టుకున్న అవినాశ్ ఇటీవల తన స్నేహితులతో కలిసి శ్యామ్ పై దాడికి పాల్పడ్డారు. త్వరలో తాను విదేశాలకు వెళ్లిపోతున్నానని.. చివరిసారి కలుద్దామని శ్యాంను ఫోన్ లో పార్టీకి పిలిచారు. పాత వివాదం సమిసిపోయిందన్న ఉద్దేశంతో అవినాశ్ మాటల్ని నమ్మిన శ్యామ్.. అతడ్ని కలిసేందుకు మరో స్నేహితుడితో కలిసి కంచికచర్ల శివసాయి క్షేత్రం వద్దకు వెళ్లారు.

కారులో అక్కడకు వచ్చిన అవినాశ్.. అతని స్నేహితులు.. శ్యామ్ ను బలవంతంగా కార్లో ఎక్కించారు. అతడి స్నేహితుడ్ని పక్కకు తోసేసి తమతో తీసుకెళ్లారు. నోట్లో గుడ్డలు కుక్కి.. కళ్లకు గంతలుకట్టి.. పరిటాల సమీపానికి వచ్చినంతనే అతడికి వార్నింగ్ ఇస్తూ.. దాడికి పాల్పడ్డారు. తాము పవర్ లో ఉన్నామని.. ఎవరైనా సరే తాము తిట్టినా.. కొట్టినా పడి ఉండాల్సిందేనని.. అతిగా మాట్లాడితే చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.

మాటలతో సరిపెట్టకుండా.. కర్రలు.. ఇనుపరాడ్లతో దాడికి పాల్పడ్డారు. కారులో ప్రయాణించినంత సేపు శ్యామ్ పై దాడి చేస్తూనే ఉన్నారు. అన్నింటికంటే దుర్మార్గమైన చర్య ఏమంటే.. గుంటూరు సమీపానికి తీసుకెళ్లి దాడి చేస్తున్నప్పుడు.. దాహం వేస్తుందని అంటే.. కారులో నుంచి దించి.. శ్యామ్ చుట్టూ అవినాశ్ అతడి స్నేహితులు కలిసి అతడి ముఖంపై మూత్రం పోయటం.. అతడి టీషర్టును విప్పించి.. దాంతో తుడవటంలాంటి అనాగరిక చర్యలకు పాల్పడ్డారు. జరిగిన విషయాలన్ని శ్యామ్ తన ఫిర్యాదులో పోలీసులకు తెలియజేశారు. తాము చేసిన దాడి గురించి కానీ.. తాము అన్న మాటల్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని.. తాము చెప్పిందే ఇప్పుడు నడుస్తుందని.. తమను ఎవరూ ఏమీ చేయలేరంటూ బిల్డప్ ఇచ్చిన అవినాశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతడికి సహకరించిన వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఈ వ్యవహారంలో రాజకీయ కోణం ఏమీ లేనప్పటికీ.. దీనికి పొలిటికల్ కలర్ అద్దే ప్రయత్నం పెద్ద ఎత్తున జరగటం చర్చనీయాంశంగా మారింది.