Begin typing your search above and press return to search.

ఏపీ జ‌నం తీర్పు ఎలా ఉన్నా.. ఎఫెక్ట్‌ మాత్రం ఇదే!

మెజారిటీ ఎంత అనేది ప‌క్క‌న పెడితే.. అధికార ప‌గ్గాలు మాత్రం ఒక్క‌రికే ద‌ఖ‌లు ప‌డ‌నున్నాయి.

By:  Tupaki Desk   |   29 May 2024 12:30 AM GMT
ఏపీ జ‌నం తీర్పు ఎలా ఉన్నా..  ఎఫెక్ట్‌ మాత్రం ఇదే!
X

ఏపీలో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడతారు? అనే విష‌యాలు తెలిసేందుకు జూన్ 4వ తేదీ వ‌ర‌కు స‌మ యం ఉంది. అయితే.. ఎవ‌రు ఓడినా.. ఎవ‌రు గెలిచినా.. రాష్ట్ర ఆర్థిక ప రిస్థితి మాత్రం ఇప్ప‌ట్లో స‌హ‌క‌రిం చేలా క‌నిపించ‌డంలేదు. స‌రే.. మౌలికంగా ఓట‌మి అనేది అటుకూట‌మికైనా.. ఇటు జ‌గ‌న్ కైనా ఎవ‌రో ఒక‌రికి త‌ప్ప‌దు. ప్ర‌జాస్వామ్య సంగ్రామంలో ఒక‌రు మాత్ర‌మే నిలిచి గెలుస్తారు. మెజారిటీ ఎంత అనేది ప‌క్క‌న పెడితే.. అధికార ప‌గ్గాలు మాత్రం ఒక్క‌రికే ద‌ఖ‌లు ప‌డ‌నున్నాయి.

ఇక్క‌డ‌.. జ‌గ‌న్ ఓడిపోయార‌ని అనుకుందాం. అంటే.. వైసీపీ అధికారం కోల్పోయింద‌ని భావిస్తే.. కీల‌క విష యాల‌పై పెను ప్ర‌భావం చూపించ‌డం ఖాయం. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు సంక్షేమాన్ని న‌మ్ముకుని.. అప్పులు సైతం చేసి ప్ర‌జ‌ల‌కు పంచిన నేప‌థ్యంలో.. దీనిని ప్ర‌జ‌లు తిరస్క‌రించాల‌ని భావించాలి. అదే స‌మ‌యంలో ఈక్వేష‌న్లు మార్చుకున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు.. అనేక మందిని మార్చారు. దీంతో ప్ర‌జ లు దీనిని కూడా తిర‌స్క‌రించాల‌ని అనుకోవాలి. మ‌రీ ముఖ్యంగా.. బీసీలకు.. మైనారిటీల‌కు అవ‌కాశం ఎక్కువ‌గా ఇచ్చారు.

రేపు జ‌గ‌న్ ఓడిపోతే.. ఇవ‌న్నీ.. ప‌నిచేయలేద‌ని చెప్పుకోవాలి. అదేస‌మ‌యంలో రేపు కూట‌మి ఓడితే కూడా.. అనేక అంశాలు కార‌ణాలుగా నిలుస్తున్నాయి. ప్ర‌ధానంగా.. అప్ప‌టిక‌ప్పుడు చేతులు క‌ల‌ప‌డాన్ని.. పార్టీలు భుజాలు భుజాలు రాసుకుని తిర‌గ‌డాన్ని ప్ర‌జ‌లు హ‌ర్షించ‌క‌పోవ‌డం ప్ర‌ధాన కార‌ణంగా నిలిచే ఛాన్స్ ఉంది. అలానే.. చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన సూప‌ర్ సిక్స్ అంత ప్ర‌భావం చూప‌లేద‌ని కూడా అనుకోవాలి. ఇక‌, మారిన మార్పుల‌కు అనుగుణంగా అభ్య‌ర్థుల మార్పును కూడా ప్ర‌జ‌లు జీర్ణించుకోలేద‌ని భావించాలి.

ఏతా వాతా ఎలా చూసుకున్నా.. టీడీపీ కూట‌మి ఓడినా.. వైసీపీ ఓడినా.. ప్ర‌జ‌లు ఆయా పార్టీలు ఎంచుకు న్న విధానాల‌ను బ‌లంగా తిప్పికొట్టిన‌ట్టే భావించాల్సి ఉంటుంది. దీంతో భ‌విష్య‌త్తులో ఏ పార్టీకానీ.. ఏ నాయ‌కుడు కానీ.. ఇక అలాంటి చ‌ర్య‌లు తీసుకునే ప‌రిస్థితి లేక‌పోగా.. ఇక అలా ఆలోచించే ప‌రిస్థితి కూడా ఉండ‌బోద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఏ పార్టీని గెలిపించినా.. ఏ పార్టీని ఓడించినా..బ‌ల‌మైన తీర్పు అయితే.. ఇస్తార‌ని చెబుతున్నారు. దీనిని స‌రిగా అర్ధం చేసుకుంటే.. భ‌విష్య‌త్తులో ఏ పార్టీ కూడా. అలాంటి త‌ప్పులు ఇక‌చేసే అవ‌కాశం ఉండ‌ద‌ని కూడా హెచ్చ‌రిస్తున్నారు.