Begin typing your search above and press return to search.

బాబు ఆ విషయంలో గ్రేట్...మెచ్చుకున్న జగన్!

పొలిటికల్ గా బాబుతో వైరం కొనసాగిస్తున్న జగన్ ఆయనను మెచ్చుకుంటారు అంటే అది అసలు జరిగేది కాదు.

By:  Tupaki Desk   |   14 Nov 2024 3:26 AM
బాబు ఆ విషయంలో గ్రేట్...మెచ్చుకున్న జగన్!
X

టీడీపీ అధినేత చంద్రబాబు అంటే ఒంటికాలి మీద వైసీపీ అధినేత లేస్తారు. అలాంటిది చంద్రబాబు గ్రేట్ అని ఆయన నోటి వెంట వస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అయితే ఆయన బాబుని నిజంగా పొగిడారా అంటే అక్కడ ఉంది మ్యాజిక్. పొలిటికల్ గా బాబుతో వైరం కొనసాగిస్తున్న జగన్ ఆయనను మెచ్చుకుంటారు అంటే అది అసలు జరిగేది కాదు.

మరి జగన్ ఎందుకు బాబుని గ్రేట్ అన్నారు అంటే అది కూడా సెటైరికల్ గానే అని చెప్పాలి. బాబు యాక్టింగ్ అదరహో అంటున్నారు జగన్. బాబు యాక్టింగ్ ఏమిటి ఆయన రాజకీయ నాయకుడు కదా అని అనుమానించవచ్చు. కానీ జగన్ దృష్టిలో బాబు యాక్టరేనట. అలా ఇలా కాదు అతి పెద్ద యాక్టర్ అని జగన్ అంటున్నారు. బాబు యాక్టింగ్ కి ముందు ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ కూడా సరిపోదని అన్నారు.

బాబు యాక్టింగ్ విషయంలో ఎవరైనా బలాదూరే అని అంటున్నారు. అంతవరకూ ఎందుకు ఆయన సొంత మామ ఎన్టీఆర్ కూడా బాబు యాక్టింగ్ ముందు సరితూగరు అని అంటున్నారు. అంతటి మహత్తరమైన నటన బాబుకే సాధ్యం ఆయనకే సొంతం అంటూ జగన్ ఆయనని ఆ విధంగా కీర్తిస్తున్నారు.

ఇది నిజంగా బాబుని పొగిడినట్లా అని ఇపుడు ఆలోచించాలి మరి. అంటే జగన్ అన్నది బాబు మహా నటుడు అని. ఆయన జనాలను తన హామీలతో బురిడీ కొట్టిస్తూ అధికారంలోకి వస్తుననరు తప్ప ఆయన ఏమీ చేయడంలేదని. మొత్తానికి అయితే చంద్రబాబు గొప్ప నటుడు అని జగన్ ఒప్పుకున్నారు. అంతే తప్ప గొప్ప పాలకుడు ఆయన కానే కారని అంటున్నారు.

బాబు ఎన్నికల హామీలను తుంగలోకి తొక్కారని, బడ్జెట్ లో ఏ ఒక్క హామీని పెట్టలేదని ఘాటుగానే నిందించారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినా బడ్జెట్ ని పూర్తి స్థాయిలో పెట్టలేదని, తీరా పెట్టిన బడ్జెట్ లో చూస్తే ఎన్నికల హామీలు అన్నీ అందులో లేకుండా పోయాయని అన్నారు. ఇక అప్పుల విషయంలో ఎన్నో చెప్పారని అవన్నీ తప్పులు అని బాబు తన బడ్జెట్ ద్వారానే ఒప్పుకున్నట్లు అయింది అని జగన్ అంటున్నారు. బాబు తన హామీలను తీర్చకుండానే అప్పులు చేస్తున్నారు అని విమర్శించారు.

ఏపీ అప్పులతో శ్రీలంకతో పోటీ పడుతోందని ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తూ విషం చిమ్మారని అన్నారు. ఎన్నికల్లో ఈ విధంగానే లబ్ది పొంది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత కూడా సూపర్ సిక్స్ హామీలను ఎగరగొట్టడానికి ఏపీ అప్పులు అని మళ్లీ చెప్పుకొచ్చారని అన్నారు. ఓటాన్ అకౌంట్ అని చెప్పి గవర్నర్ చేత కూడా అబద్ధాలు చెప్పించారని విమర్శించారు.

ఎన్నికల ముందు పద్నాలుగు లక్షల అప్పు చెప్పి రాష్ట్రం అప్పులు పది లక్షలు అంటూ ఎన్నికల తర్వాత చెప్పారని జగన్ మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చలేనని తప్పు ఒప్పుకోడని రామారావు యాక్షన్ నథింగ్ బాబు యాక్షన్ ముందు అని జగన్ ఫైర్ అయ్యారు.