Begin typing your search above and press return to search.

మస్క్‌ కు నాసా కాంట్రాక్ట్‌... కూల్చివేతకు రూ.7000 కోట్లు!

ఇంత భారీ కాంట్రాక్ట్ ను ఎలాన్ మస్క్ ను నాసా ఎందుకు ఇస్తుంది.. ఇది ఎప్పుడు మొదలవ్వబోతుంది అనేది ఈ నేపథ్యంలో ఆసక్తిగా మారింది.

By:  Tupaki Desk   |   30 Jun 2024 6:09 AM GMT
మస్క్‌  కు నాసా కాంట్రాక్ట్‌... కూల్చివేతకు రూ.7000 కోట్లు!
X

స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్ విలువ 843 డాలర్లు.. అంటే భారత కరెన్సీలో సుమారు 7000 కోట్ల రూపాయలకు పైమాటే అన్నమాట. ఇంత భారీ కాంట్రాక్ట్ ను ఎలాన్ మస్క్ ను నాసా ఎందుకు ఇస్తుంది.. ఇది ఎప్పుడు మొదలవ్వబోతుంది అనేది ఈ నేపథ్యంలో ఆసక్తిగా మారింది.

అవును... తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా.. స్పేస్ ఎక్స్ తో ఓ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. భూ ఉపరితలానికి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐ.ఎస్.ఎస్.) తొలగించడానికి ఈ కాంట్రాక్ట్ కావడ్దం గమనార్హం. ఈ దశాబ్ధం చివరికల్లా ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని తొలగించనున్నారు. ఈ మేరకు నాసా ఇప్పటి నుంచి దీనికోసం ప్రణాళికలు రచిస్తోంది.

ఈ ప్రణాలికలకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసిన నాసా... 2030లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం జీవితకాలం పూర్తయిన తర్వాత.. నాసాతో పాటు భాగస్వామ్య దేశాలు దాన్ని కక్ష్య నుంచి వేరు చేయనున్నాయని తెలిపింది. అనంతరం దాన్ని సురక్షితంగా సముద్రంలో పడేస్తామని వెల్లడించింది. దీనికోసం జనసాంద్రత లేని ప్రదేశాలను గుర్తిస్తున్నట్లు తెలిపింది.

ఇదే సమయంలో... ఈ విచ్చిన్న ప్రక్రియలో భాగంగా ముందుగా ఫుట్ బాల్ మైదానం అంత పరిణామంలో ఉండే ఈ రీసెర్చ్ ల్యాబ్ ను 2030 మధ్యలో కొంచెం కొంచెంగా కిందకు తీసుకురానున్నారు. అనంతరం కీలక సామాగ్రితో వ్యోమగాములు భూమిమీదకు దిగుతారు. అనంతరం స్పేస్ ఎక్స్ ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న "యూఎస్ డీఆర్బిట్ వెహికల్" దీన్ని భూ వాతావరణంలోకి తీసుకొస్తుంది.

సుమారు 72 మీటర్ల పొడవు, 108 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తు ఉండి.. అందులో ఐదు బెడ్ రూములు ఉన్న ఈ అంతరిక్ష కేంద్రం భూవాతావరణంలోకి తీసుకురాగానే కాలిపోతుంది. అనంతరం వాటి శకలాలను సముద్రంలో పడేలా చేస్తారు.

కాగా... మానవ నివాసయోగ్యమైన, మానవ నిర్మితమైన ఈ ఉపగ్రహాన్ని 1998లో ప్రారంభించారు. ఇది భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఇది భూమి చుట్టూ తిరగడానికి 93 నిమిషాలు పడుతుంది. ఇప్పటివరకూ 19 దేశాల వ్యోమగాములు, అంతరిక్ష పర్యటకులు దీన్ని సందర్శించారు. అమెరికాతో పాటు రష్యా, జపాన్, ఐరోపా, కెనడా లు సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తుంటాయి.