Begin typing your search above and press return to search.

తాజా తీర్పు: అందరి ముందు భర్తను తిడితే విడాకులకు ఓకే!

ఢిల్లీ హైకోర్టు ఎదుట వచ్చిన ఒక విడాకుల కేసుకు సంబంధించి.. వెల్లడైన తీర్పు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది

By:  Tupaki Desk   |   25 Dec 2023 5:12 AM GMT
తాజా తీర్పు: అందరి ముందు భర్తను తిడితే విడాకులకు ఓకే!
X

ఆసక్తికర తీర్పును ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. భార్య నుంచి భర్త విడాకులు కోరిన ఉదంతంలో.. తాను విడాకులు కోరటానికి కారణం ఇదేనంటూ ఒక భర్త.. తన భార్య చేసిన పనుల్ని చూపించటం ద్వారా కోర్టును కన్వీన్స్ చేయటమే కాదు.. విడాకులు ఇవ్వటానికి ఈ కారణం చాలు అనేలా చేశారు. ఒక విడాకుల కేసులో భర్త వాదనల్ని కోర్టు సమర్థించింది. ఆయన కోరుకున్నట్లుగా విడాకులకు ఓకే చెప్పింది. ఇంతకూ భార్య చేసిన తప్పు ఏమిటో తెలుసా? బహిరంగంగా భర్తను తూలనాడటమే. ఏంటి? ఆశ్చర్యపోతున్నారా? అసలు సంగతేమంటే..

ఢిల్లీ హైకోర్టు ఎదుట వచ్చిన ఒక విడాకుల కేసుకు సంబంధించి.. వెల్లడైన తీర్పు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. భర్తను బహిరంగంగా తూలనాడటం.. అతడి క్యారెక్టర్ ను వేలెత్తి చూపిస్తూ అర్థం లేని ఆరోపణలు చేయటం క్రూరమైన నేరంగా అభివర్ణించటమే కాదు.. విడాకులు మంజూరు చేయటానికి కారణంగా మారింది. ఒక జంటకు 2000లో పెళ్లైంది. నాలుగేళ్ల అనంతరం.. 2004లో కొడుకు పుట్టాడు.

ఆ తర్వాత రెండేళ్ల తర్వాత నుంచి భర్తను భార్య వేధించటం షురూ చేసింది.ఆయన పని చేసే ఆఫీసుకు వెళ్లే ఆమె.. భర్తను ఉద్దేశించి తప్పుడు మాటలు మాట్లాడేది. తన భర్త ఆడోళ్ల పిచ్చి ఉందని.. నంపుంసకుడని తిట్టేది. అందరి ఎదుటఅదే పనిగా అవమానకరంగా మాట్లాడేది. అక్కడితో ఆగని ఆమె.. కొడుకు చేత కూడా తండ్రిని తిట్టించేది. దీంతో సదరు భర్త తీవ్రంగా తల్లడిల్లేవాడు.

ఇలా తాను పని చేసే చోట.. తన కొడుకు చేత తనను తిట్టించే తన భార్య.. చివరకు తన బంధువుల ముందు కూడా దూషణలకు దిగేది. దీంతో.. తాను పడుతున్న మానసిక క్షోభను ఫ్యామిలీ కోర్టుకు తెలియజేస్తూ తనకు విడాకులు మంజూరు చేయాలని అభ్యర్థించారు. తమ ఎదుట ఉన్న ఆధారాలతో వారికి విడాకులు మంజూరుచేస్తూ ఫ్యామిలీ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీనిపై భార్య అప్పీలుకు వెళ్లారు. ఢిల్లీ హైకోర్టు ముందుకు వచ్చిన ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం.. భర్తను బహిరంగంగా తూలనాడటం.. అవమానించటాన్ని తీవ్రమైన క్రూరత్వంగా పేర్కొంటూ ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకుల్ని సమర్థిస్తూ తీర్పును ఇచ్చింది. సో.. భర్తను ఆడుకునే ఈ తరహా భార్యలకు తాజా తీర్పు షాకిచ్చేలా మారిందని చెప్పక తప్పదు.