Begin typing your search above and press return to search.

భార్య పదేపదే పుట్టింటికి వెళ్లడం తప్పేనా?

కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందంటారు. భార్యాభర్తల జీవితంలో నమ్మకమే ప్రధానం. వారి మధ్య ఉండే విశ్వాసంతోనే కలకాలం జీవిస్తారు

By:  Tupaki Desk   |   7 April 2024 3:30 PM GMT
భార్య పదేపదే పుట్టింటికి వెళ్లడం తప్పేనా?
X

కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందంటారు. భార్యాభర్తల జీవితంలో నమ్మకమే ప్రధానం. వారి మధ్య ఉండే విశ్వాసంతోనే కలకాలం జీవిస్తారు. ఆలుమగల బంధంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పెళ్లాం పదేపదే పుట్టింటికి వెళ్లడం వల్ల సంసార బాంధవ్యం దెబ్బతింటుందని స్పష్టం చేసింది. భార్య తరచు పుట్టింటికి వెళితే భర్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతోంది.

దంపతుల మధ్య అనురాగం, ఆప్యాయత, ప్రేమ, విశ్వాసం, ఆరాధన ఉండటం వల్ల వైవాహిక జీవితం నందనవనంగా మారుతుందని తెలిపింది. భార్య పదేపదే పుట్టింటికి వెళ్లడాన్ని తప్పుబట్టింది. తన భార్య ఊరికే పుట్టింటికి వెళ్తుందని ఓ భర్త వేసిన పిటిషన్ పై విచారణ చేసిన కోర్టు పైవిధంగా వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ సురేష్ కుమార్ కైత్ ఆధ్వర్యంలో ధర్మాసనం విడాకుల కేసు విచారణ జరిపింది.

పందొమ్మిదేళ్ల వైవాహిక జీవితంలో భార్య భర్తను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. పది నెలల పాటు పుట్టింట్లోనే ఉండిపోయింది. దీని వల్ల భార్య నుంచి విడాకులు కావాలని సదరు భర్త మొదట ఫ్యామిలీ కోర్టు కు వెళ్లాడు. తరువాత కేసు హైకోర్టుకు చేరింది. దీనిపై హైకోర్టు భార్యాభర్తల బంధంపై కీలక వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగించింది.

ఆలుమగలు సంయమనం కోల్పోవడం వల్ల దూరం పెరిగే అవకాశముంటుంది. అది తెగేదాకా వెళితే కష్టమే. వారు ఎన్నటికి కలవలేనంత దూరం పెరుగుతుంది. హింస, క్రూరత్వం వంటి లక్షణాలు ఎక్కువైతే ఇక దంపతుల మనుగడ కష్టంగా మారుతుంది. భార్యాభర్తల విడాకుల విషయంలో అనుకూలంగా తీర్పు వెలువరించేందుకే మొగ్గు చూపింది. దీంతో సంచలనం కలిగింది.

దీంతో భార్యాభర్తల బంధంలో ఎవరు సరిగా లేకపోయినా విడాకులు కోరడం సహజమే. భార్య పెట్టే బాధలు భరించలేక భర్త కోర్టుకు వెళ్లడం జరిగింది. దీనికి కోర్టు కూడా సమ్మతి తెలియజేయడంతో వారికి విడాకులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడమే సంచలనంగా చెబుతున్నారు. దంపతుల మధ్య అవగాహన పెంచి కాపురం చేయించాల్సింది పోయి విడాకులు మంజూరు చేయడం గమనార్హం.