Begin typing your search above and press return to search.

తన రాసలీలలు బయటపెట్టిందని.. ఈ ప్రబుద్ధుడు చేసిన పని ఇది!

వివరాల్లోకివెళ్తే... ఇంగ్లండ్‌ లో ఒక వ్యక్తి తన ఐఫోన్‌ లోని ఐ మెసేజ్‌ యాప్‌ ను ఉపయోగించి పలువురు సెక్స్‌ వర్కర్లతో హాట్‌ హాట్‌ సంభాషణలు జరిపాడు.

By:  Tupaki Desk   |   17 Jun 2024 1:08 PM GMT
తన రాసలీలలు బయటపెట్టిందని.. ఈ ప్రబుద్ధుడు చేసిన పని ఇది!
X

తాను వాడుతున్న ఫోన్‌ కంపెనీ తన రాసలీలల రహస్యాన్ని బయటపెట్టిందని ఒక వ్యక్తి ఆ సంస్థపై రూ.53 కోట్లకు దావా వేయడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఆ వ్యక్తి తన భార్యకు తెలియకుండా పలువురు సెక్స్‌ వర్కర్లతో శృంగారం జరిపాడు. ఇందుకు సంబంధించిన మెసేజులను తన ఐఫోన్‌ లో డిలీట్‌ చేశాడు. అయినప్పటికీ ఆ మేసేజులను తన భార్య చూడటంతో అతడికి విడాకులిచ్చింది. దీంతో ఐఫోన్‌ కంపెనీ తనను మోసం చేసిందంటూ అతడు రూ.53 కోట్లకు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు.

వివరాల్లోకివెళ్తే... ఇంగ్లండ్‌ లో ఒక వ్యక్తి తన ఐఫోన్‌ లోని ఐ మెసేజ్‌ యాప్‌ ను ఉపయోగించి పలువురు సెక్స్‌ వర్కర్లతో హాట్‌ హాట్‌ సంభాషణలు జరిపాడు. ఈ మెసేజులేవీ తన ఫోన్‌ లో లేకుండా.. అవి ఎవరికీ కనిపించనీయకుండా డిలీట్‌ కూడా చేశాడు. అయితే ఐఫోన్‌ లాగిన్‌ కి వాడుతున్న యూజర్‌ ఐడీ, పాస్‌ వర్డునే ఐమ్యాక్‌ లోనూ ఉపయోగిస్తున్నాడు.

దీంతో అతడు సెక్స్‌ వర్కర్లతో జరిపిన చాట్స్‌ ఐమ్యాక్‌ లో అలాగే ఉండిపోయాయి. ఐఫోన్‌ లో మాత్రమే అవి డిలీట్‌ అయ్యాయి. అనుకోకుండా ఒకరోజు అతడి భార్య ఐమ్యాక్‌ వినియోగించగా తన భర్త రాసలీలల వ్యవహారం వెలుగుచూసింది. దీంతో ఆమె అతడికి విడాకులు ఇచ్చింది. తమ వివాహ బంధాన్ని రద్దు చేసుకుంది.

దీంతో ఒళ్లు మండిన అతడు ఐఫోన్‌ సంస్థ యాపిల్‌ పై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. యాపిల్‌.. మెసేజ్‌ డిలీట్ల వ్యవహారానికి సంబంధించి సరి అయిన గైడెన్స్‌ తనకు ఇవ్వలే దని.. ఈ కారణంగా తాను ఐఫోన్‌ లో డిలీట్‌ చేసిన మెసేజులను తన భార్య ఐమ్యాక్‌ లో చూసిందని ఆరోపించాడు. యాపిల్‌ సంస్థ కారణంగా తాను తన భార్య నుంచి విడిపోవాల్సి వచ్చిందని విమర్శించాడు. ఇందుకు గానూ యాపిల్‌ తనకు 5 మిలియన్‌ పౌండ్లు (భారత్‌ కరెన్సీలో రూ.53 కోట్లు) చెల్లించాలని పిటిషన్‌ వేశాడు.

ఫోన్‌ లో మెసేజ్‌ డిలీట్‌ చేస్తే అవి పూర్తిగా డిలీట్‌ అయిపోయాయని అనుకున్నానని అతడు తెలిపాడు. అయితే ఆ ఐడీతో లింక్‌ అయిన ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఆ మెసేజులు అలాగే ఉండిపోయానే విషయాన్ని యాపిల్‌ తనకు సరిగ్గా చెప్పలేదని తన పిటిషన్‌ లో పేర్కొన్నాడు. దీంతో తాను డిలీట్‌ చేసిన మెసేజులు కేవలం ఐఫోన్‌ లో మాత్రమే అయ్యాయని.. ఐమ్యాక్‌ లో అలాగే ఉండిపోయాయన్నాడు. యాపిల్‌ చేసిన పనివల్ల తాను తన భార్య నుంచి విడిపోవాల్సి వచ్చిందన్నాడు.

ముందుగానే యాపిల్‌ మెసేజ్‌ డిలీట్‌ కు సంబంధించి సరైన అవగాహన కల్పించినా, మీ మెసేజులు ఒక్క డివైజ్‌ లోనే డిలీట్‌ అయ్యాయని అలర్ట్‌ మెసేజ్‌ ఇచ్చినా యూజర్లు అప్రమత్తం కావడానికి అవకాశం అంటుందని తెలిపారు. అయితే యాపిల్‌ ఈ విషయాన్ని తనకు సరిగ్గా చెప్పలేదన్నాడు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ తనకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టుకెక్కాడు.

యాపిల్‌ తనకు 5 మిలియన్‌ పౌండ్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 53కోట్లు) చెల్లించాలని దావా వేశాడు. ఈ పిటిషన్‌ పై స్థానిక కోర్టు త్వరలోనే విచారణ జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.