చంద్రబాబుకు సెకండ్ టైమ్ గెలిచిన చరిత్ర లేదా ?
అంటే ఆయనకు వరస ఓటములు ఉన్నాయి తప్ప విజయాలు లేవు అన్నది చరిత్ర చెబుతున్న సత్యం.
By: Tupaki Desk | 23 Nov 2024 12:30 PM GMTటీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తం పొలిటికల్ హిస్టరీలో తీసుకుంటే ఒకసారి గెలిచిన తరువాత ఆ విజయాన్ని మరోసారి కొనసాగించే పరిస్థితి అయితే లేదు. 1999లో గెలిచిన చంద్రబాబు 2004, 2009లో వరసగా ఓటమి పాలు అయ్యారు. అంటే ఆయనకు వరస ఓటములు ఉన్నాయి తప్ప విజయాలు లేవు అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. అంతే కాదు 2014లో గెలిచిన బాబు 2019లలో ఓటమి పాలు అయ్యారు
ఇపుడు 2024లో గెలిచిన చంద్రబాబు 2029 కూడా నాదే అని నిండు అసెంబ్లీలో చాటి చెప్పారు. అయితే బాబు ధీమా వెనక ఏమి ఉందో తెలియదు కానీ ఆయన టోటల్ పొలిటికల్ ట్రాక్ రికార్డు చూస్తే కనుక ఆయన రెండవ సారి వరసగా గెలిచిన దాఖలాలు అయితే లేవు.
ఇక చూసుకుంటే చంద్రబాబు దేశంలోనే మొత్తం సీనియర్ పొలిటీషియన్ అని చెప్పాలి. ఆ విషయంలో అయితే ఎవరికీ ఎటువంటి సందేహమూ లేదు. అయితే బాబుకు ఉన్న మైనస్ పాయింట్లు చూస్తే ఎపుడు ఏమి చేస్తారో ఏమి చెబుతారో తెలియదు అని అంటారు. అంతే కాదు ఆయన ఎపుడు ఏ కూటమి వైపు మొగ్గు చూపుతారో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది అని అంటూంటారు.
చంద్రబాబు 1995లో తన మామ ఎన్టీఆర్ దగ్గర నుంచి సీఎం పోస్టు తీసుకున్నారు. అపుడు ఆయనకు పొలిటికల్ గా టైమ్ బాగుంది. లక్ష్మీపార్వతి హవాను తట్టుకోలేక కొంతమంది చంద్రబాబు వైపు వచ్చారు. అంటే అలా బాబు సీఎం అయ్యారు తప్ప ఆయన సొంతంగా గెలిచి కాదు అన్నది అందరికీ తెలిసిందే.
ఇక 1999లో చూసుకుంటే తొలిసారి చంద్రబాబు తన ఫేస్ తో జనంలోకి వెళ్ళిన ఎన్నికలుగా చూడాలి. ఆనాడు బీజేపీతో పొత్తు పెట్టుకుని వాజ్ పేయి వేవ్ లో మొత్తానికి బాబు గెలిచి మళ్లీ సీఎం అయ్యారు. ఇక 2004 2009లలో అయితే వైఎస్సార్ హవా ముందు చంద్రబాబు ఏ మాత్రం తట్టుకోలేకపోయారు అని చెప్పాలి. అలా ఆ రెండు ఎన్నికల్లో బాబు దారుణంగా ఓటమి చెందారు.
ఇక ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయిన తరువాత బాబు తన సీనియారిటీ ఇమేజ్ తో గెలిచారు. ప్రజలు కూడా బాబు అనుభవానికి ఓటి వేశారు. అదే సమయంలో వైసీపీకి 67 సీట్లు ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా కూడా చాన్స్ ఇచ్చారు. ఇక 2018లో చంద్రబాబు టీడీపీకి 23 సీట్లు ఓడించిన ప్రజలు వైసీపీకి 151 సీట్లు ఇచ్చి బ్రహ్మాండమైన మెజారిటీని కట్టబెట్టారు.
దాంతో ఈ భారీ మెజారిటీతో ఉబ్బి తబ్బిబ్బు అయిన జగన్ తానే ఇక రాజకీయాల్లో దేవుడిని అని తనకు తిరుగులేదని క్యాడర్ ని సైతం పట్టించుకోకుండా విర్రవీగడం తో ఆయన పార్టీకి 2024లో చావు దెబ్బ కొట్టారు ఏపీ జనాలు. అలా వైసీపీకి 11 సీట్లు మాత్రమే వస్తే టీడీపీ కూటమికి 164 సీట్లు దక్కాయి.
ఈ ఫలితాలను చూసుకుని చంద్రబాబు తాము మళ్లీ ఐదవసారి సీఎం గా ఇదే అసెంబ్లీకి వస్తాను అని చెబుతున్నారు. అయితే బాబుకు ఒక యాంటీ సెంటిమెంట్ ఉంది. ఒకసారి గెలిచిన తరువాత మళ్లీ ఆయన పార్టీని వరసగా రెండోసారి గెలిపించిన దాఖలాలు అయితే ఇప్పటిదాకా లేవు అనే అంటున్నారు. అదే యాంటీ సెంటిమెంట్ ని వైసీపీ నమ్ముకుని బాబుకు మళ్ళీ నో చాన్స్ అని అంటోంది.
ఇక బాబు మళ్లీ అయిదవసారి సీఎం అయితే లోకేష్ కి సీఎం అయ్యే యోగం లేదా అని మరో వైపు సొంత పార్టీలోనూ చర్చ సాగుతోంది. ఈ విషయంలో లోకేష్ కూడా అడగాలి కదా అని ఆయనకు మద్దతుగా ఉన్న యంగ్ లీడర్లు అంటున్నారు. మొత్తానికి చూస్తే కనుక చంద్రబాబు ఐదవసారి తాను గెలుస్తాను అని చెబుతున్న మాటలు సొంత పార్టీలోనూ బయటా కూడా చర్చనీయాంశం అవుతున్నాయి.
అయితే బాబు పొలిటికల్ ట్రాక్ రికార్డుని చూసిన వారు విశ్లేషకులు మాత్రం ఏపీ జనాలను అంత తక్కువగా అంచనా వేయకూడదని అంటున్నారు. మొత్తానికి అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోనే బాబులో అమాంతం పెరిగిన ధీమా వెనక వ్యూహాలు ఏమిటో కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు.