Begin typing your search above and press return to search.

ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి భారీ షాక్

శనివారం సాయంత్రం ఆరు గంటలతో హర్యానాలో పోలింగ్ పూర్తి అయ్యాక ఎగ్జిట్ పోల్స్ రావడం మొదలైంది.

By:  Tupaki Desk   |   5 Oct 2024 3:58 PM GMT
ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి భారీ షాక్
X

భారతీయ జనతా పార్టీకి రెండు రాష్ట్రాలలో భారీ ఎదురు దెబ్బ తగలబోతోందా అంటే ఎగ్జిట్ పోల్స్ అదే నిజం అంటున్నారు. హర్యానాలో పదేళ్ల పాటు అధికారం చలాయించిన బీజేపీ తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోతుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.

శనివారం సాయంత్రం ఆరు గంటలతో హర్యానాలో పోలింగ్ పూర్తి అయ్యాక ఎగ్జిట్ పోల్స్ రావడం మొదలైంది. కాశ్మీర్ కి చివరి విడత పోలింగ్ అక్టోబర్ 1న ముగిసింది. దాంతో ఈ రెండు రాష్ట్రాలలో ఏవరిది అధికారం అన్న సంగతిని ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి.

హర్యానాలో చూస్తే మూడింట రెండు వంతుల సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఇక్కడ 46 మ్యాజిక్ ఫిగర్ అయితే కాంగ్రెస్ 60కి పైగా సీట్లను సాధించే చాన్స్ ఉందని స్పష్టం చేస్తున్నాయి.

అలాగే కాశ్మీర్ లో చూసుకుంటే అక్కడా 90 సీట్లు ఉన్న అసెంబ్లీలో 46 మ్యాజిక్ ఫిగర్. అయితే ఏ పార్టీకి మెజారిటీ సొంతంగా వచ్చే సీను అయితే లేదని హంగ్ రావచ్చు అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు దక్కనున్నాయి. ఇక తరువాత స్థానంలో బీజేపీ ఉంటుందని చెబుతున్నాయి. మూడవ ప్లేస్ లో పీడీఎఫ్ కి చ్చాయి.

ముందుగా హర్యానా ఎగ్జిట్ పోల్స్ ని పరిశీలిస్తే పీపుల్స్ పల్స్ సర్వేలో కాంగ్రెస్ 55, బీజేపీ 26, ఐఎన్ఎల్డీ, 2-3, జేజేపీ 1 దక్కించుకున్నాయి. అలాగే సట్టా బజార్ సర్వే చూస్తే కనుక కాంగ్రెస్ 50, బీజేపీ 25 వస్తాయని తేల్చింది. అలాగే, ఏబీపీ-సీ ఓటర్ సర్వే లో మాత్రం ఏకంగా బీజేపీ బీజేపీ 78 సీట్లు సాధిస్తుందని అనుకూలమైన తీర్పు చెప్పింది. కాంగ్రెస్ 8 సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొనడం విశేషం. న్యూస్ 18-ఐపీఎస్ఓఎస్ సర్వే చూసినా బీజేపీ 75, కాంగ్రెస్ 10 సీట్లు ఇచ్చాయి. అంటే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు మాత్రం కాంగ్రెస్ కే అధికారం అని చెబుతున్నాయన్న మాట.

ఇక జమ్మూ కశ్మీర్ లో చూస్తే పీపుల్స్ పల్స్ సర్వేలో నేషనల్ కాన్ఫరెన్స్ కి 33-35, బీజేపీ 23-27, కాంగ్రెస్ 13-15, పీడీపీ 7-11, ఏఐపీ 1, ఇతరులు 4-5 దక్కించుకుంటారని చెప్పింది. రిపబ్లిక్ మాట్రిజ్ సర్వే ప్రకారం చూస్తే బీజేపీ 25, కాంగ్రెస్ 12, నేషనల్ కాన్ఫరెన్స్ 15, పీడీపీ 28, ఇతరులు 7 సీట్లు అని పేర్కొంది.

ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే చూస్తే నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి 11-15, బీజేపీ 27-31, పీడీపీ 2, ఇతరులు 1గా తేల్చింది. మొత్తం మీద చూస్తే ఇండియా టుడే సీ ఓటరు సర్వే తప్ప మిగిలినవి అన్నీ నేషనల్ కాన్ఫరెన్స్ , కాంగ్రెస్ కూటమికే అధికారం అని చెబుతున్నాయి. దీంతో బీజేపీకి బిగ్ షాక్ ఈ రెండు రాష్ట్రాల్లో తగులుతుంది అని అంటున్నారు. అసలు ఫలితాలు ఈ నెల 8న విడుదల కానున్నాయి.