Begin typing your search above and press return to search.

కేజ్రీవాల్ తో ఫ్యూచర్ లోనూ కాంగ్రెస్ తో పొత్తుకు నో!

ఇలాంటి వేళ.. అలాంటి ప్రచారానికి తన వ్యాఖ్యలతో ఫుల్ క్లారిటీ ఇవ్వటమే కాదు.. తలుపుల్ని పూర్తిగా మూసేసినట్లుగా చెప్పాలి.

By:  Tupaki Desk   |   19 Jan 2025 4:30 AM GMT
కేజ్రీవాల్ తో ఫ్యూచర్ లోనూ కాంగ్రెస్ తో పొత్తుకు నో!
X

ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేడి.. ఆ రాష్ట్రంలో ఇప్పటికే సెగలు పుట్టిస్తోంది. దీనికి తోడు ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. పనిలో పనిగా విమర్శలు.. ఆరోపణల విషయంలో ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇలాంటి వేళ.. అధికార ఆమ్ ఆద్మీకి.. ఒకప్పుడు ఢిల్లీని నాన్ స్టాప్ గా ఏలిన కాంగ్రెస్ పార్టీల మధ్య ఎన్నికల పొత్తు కుదురుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వేళ.. అలాంటి ప్రచారానికి తన వ్యాఖ్యలతో ఫుల్ క్లారిటీ ఇవ్వటమే కాదు.. తలుపుల్ని పూర్తిగా మూసేసినట్లుగా చెప్పాలి.

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత అవసరమైతే ఆమ్ ఆద్మీకి మద్దతు ఇస్తారా? అంటూ కాంగ్రెస్నేత అజయ్ మాకెన్ ను అడగ్గా.. ఆయన నోటి నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి. కేజ్రీవాల్ పార్టీతో కాంగ్రెస్ కు ఫ్యూచర్ లో ఎలాంటి పొత్తు అక్కర్లేదన్నారు. అయితే.. తాను చేసిన వ్యాఖ్యలన్నీ కూడా వ్యక్తిగత అభిప్రాయంగా పేర్కొన్నారు.అయితే.. కాంగ్రెస్ అధినాయకత్వం ఎలాంటి భావనలో ఉందన్న విషయాన్ని అంచనా వేసుకొనేలా మాకెన్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి.

మాకెన్ మాటల నేపథ్యంలో ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ మొత్తం అధికార ఆమ్ ఆద్మీ వర్సెస్ బీజేపీ మధ్యనే జరుగుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో పెద్దగా పట్టు లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల బరిలో కాంగ్రెస్ నిలిచినప్పటికీ.. అది చూపే ప్రభావం అంతంత మాత్రమేనని చెప్పాలి.

మరో విషయం ఏమంటే.. ఇండియా కూటమిలో భాగంగా లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీచేసిన పార్టీల్లో ఆప్ సహా ఒక్కొక్క పార్టీ కాంగ్రెస్ నుంచి దూరం కావటం గమనార్హం. మరోవైపు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే సమాజ్ వాదీ పార్టీ సైతం ఆ పార్టీ నుంచి దూరం జరుగుతోంది. ఢిల్లీ ఎన్నికల్లో ఈ పార్టీ కాంగ్రెస్ కు కాకుండా అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి అండగా నిలుస్తూ.. మద్దతు ఇస్తోంది. దీదీ పార్టీ సైతం ఆమ్ ఆద్మీ పార్టీకే మద్దతు ఇవ్వటం గమనార్హం. ఒక్కొక్కరిని దూరం చేసుకుంటున్న కాంగ్రెస్ కు ఢిల్లీ ఎన్నికలు భారీగా నష్టం చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ఢిల్లీ ఓటర్లు ఎలాంటి తీర్పును ఇస్తారో చూడాలి.