Begin typing your search above and press return to search.

అదానీ డీల్ మీద నోరు విప్పనున్న జగన్ ?

ఇక ఏపీలో చూస్తే కాంగ్రెస్ వామపక్షాలు ఇదే అంశాన్ని పట్టుకుని టీడీపీ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   28 Nov 2024 3:35 AM GMT
అదానీ డీల్ మీద నోరు విప్పనున్న జగన్ ?
X

దేశంలో అదానీ ప్రకంపనలు బలంగా ఉన్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ అంశం మీదనే సాగుతున్నాయి. విపక్షాలు సభలో డిమాండ్ చేస్తూంటే వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇక ఏపీలో చూస్తే కాంగ్రెస్ వామపక్షాలు ఇదే అంశాన్ని పట్టుకుని టీడీపీ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాయి.

పీసీసీ చీఫ్ అయిన వైఎస్ షర్మిల అయితే అదానీ విషయంలో సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం అదానీతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయమని కూడా ఆమె కోరుతున్నారు.

దీని మీద విజయవాడలో పాదయాత్ర చేసిన షర్మిల తాజాగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలసి వినతిపత్రం అందించారు. లక్షల కోట్ల రూపాయల ప్రజల మీద భారం పడేలా పాతికేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉండబోతోంది అని అందువల్ల దానిని రద్దు చేయాలని ఆమె కోరారు.

ఇదిలా ఉంటే మరో వైపు అదానీ పేరు అమెరికా కోర్టులో వేసిన చార్జిషీటులో లేదని అంటున్నారు. అదానీ విషయంలో అంతా క్లియర్ ఉందని ఆ సంస్థ నుంచి కూడా వివరణ వస్తోంది. ఇంకో వైపు చూస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో అవినీతి చోటు చేసుకోలేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం సౌర విద్యుత్ యూనిట్‌ ని రూ.2.49లకే కొనుగోలు చేశారని, దీని వల్ల ఏటా రూ.3,700 కోట్లు ఆదా అవుతుందని చెప్పారు. అదానీ సంస్థతో ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని, కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ఒప్పందం చేసుకున్నట్లుగా ఆ పార్టీ నేతలు అంటున్నారు.

ఈ విషయాలు అన్నీ ఇలా ఉంటే బెంగళూరు నుంచి గురువారం తాడేపల్లికి చేరుకుంటున్న జగన్ మీడియా మీట్ నిర్వహిస్తారు అని అంటున్నారు. ఈ సమావేశంలో ఆయన ఏ ఏ అంశాలు మాట్లాడుతారు అన్నది ఆసక్తిగా మారింది. బడ్జెట్ మీద గత మీడియా మీట్ లో మాట్లాడిన జగన్ ఇపుడు ఏపీని కుదిపేస్తున్న అదానీ ముడుపుల వ్యవహారం మీద మాట్లాడుతారా అని కూడా అంటున్నారు. అదానీ ముడుపుల విషయంలో వైసీపీ నేతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

ఇపుడు జగన్ ఆనాడు ముఖ్యమంత్రిగా తమ ప్రభుత్వ హయాంలో ఏమి జరిగింది అన్నది పూర్తిగా వివరిస్తారు అని అంటున్నారు. అంతే కాదు ఈ విషయంలో ఆయన ఆధారసహితంగా మాట్లాడుతారు అని అంటున్నారు.

అదే విధంగా గత వారంగా ఏపీలో చోటు చేసుకుంటున్న అనేక రాజకీయ పరిణామాల మీద కూడా జగన్ స్పందిస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే జగన్ నోటి వెంట అదానీ డీఎల్ వస్తే కనుక అది రాజకీయంగా వైరల్ అయ్యే అవకాశం ఉంది. ఇంతకీ జగన్ ఏమి చెబుతారు అన్నది చూడాల్సి ఉంది.