మళ్లీ 'సభ'.. జగన్ ముందు రెండు ఆప్షన్లు.. !
ఫైనల్‌గా ఆయన సభ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించాలనే విషయాన్ని నిర్ణయిస్తారు.
By: Tupaki Desk | 23 Oct 2024 1:30 AM GMTఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం రెడీ అవుతోంది. ఈ సారి శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇవి నవంబరు రెండు లేదా మూడో వారంలో ప్రారంభమై.. డిసెంబరు తొలి లేదా రెండో వారంలో ముగియ నున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ సహా.. స్పీకర్ అయ్యన్న పాత్రు డు కూడా సభా కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. వీరు ఒక నిర్ణయం తీసుకుని.. సీఎం చంద్రబాబుకు విన్నవి స్తారు. ఫైనల్‌గా ఆయన సభ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించాలనే విషయాన్ని నిర్ణయిస్తారు.
ఈ నేపథ్యంలో సభ విషయంలో వైసీపీ అధినేత చుట్టూ మరోసారి వార్తలు గిరికీలు కొడుతున్నాయి. ఆయ న ఈ సారి ఏం చేస్తారు? ఇప్పుడైనా వస్తారా? లేదా? అనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో వైసీపీ నేత ల కంటే.. విశ్లేషకుల కంటే కూడా.. టీడీపీ కూటమి పార్టీలే ఎక్కువగా చర్చిస్తుండడం గమనార్హం. దీనికి కారణం.. ఇప్పటి వరకు రెండు సార్లు సభ పెట్టగా.. ఒక్కసారి కూడా జగన్ పూర్తిగా సభలకు హాజరు కాలేదు. పైగా.. ఆయన కోర్టులో కేసు ఉందని చెబుతున్నారు.
11 మంది ఎమ్మెల్యేలే విజయం దక్కించుకున్నా.. సభలో మరో పార్టీ ప్రతిపక్షంగా లేనందున తమకే ప్రధా న ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నది జగన్ డిమాండ్. దీనికి అధికార పక్షం ససేమిరా అంటోంది. ఈ నేప థ్యంలోనే వివాదం హైకోర్టు కు చేరింది. దీనిపై ఎలాంటితీర్పు రాలేదు. ఎప్పుడు వస్తుందో కూడా తెలియ దు. ఈ నేపథ్యంలో జరుగుతున్న సభలకు జగన్ వస్తారా? రారా? అనేది చర్చగా మారింది. ఈ క్రమంలో జగన్ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.
1) తాను వెళ్లకుండా.. సభ్యులను పంపించడం. ఇది జరిగితే.. కొంత వరకు వైసీపీ హాజరు వేసుకుని వచ్చి నట్టు అయినా ఉంటుంది. కానీ, దీనివల్ల రాజకీయంగా ప్రయోజనం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక, 2) అందరూ కలిసి వెళ్లడం. జగన్ సహా 11 మంది ఎమ్మెల్యేలు.. సభకు హాజరవ్వాలి. ప్రజల సమస్య లపై చర్చించేందుకు ప్రయత్నించాలి. మైకు దక్కితే సరే.. లేకపోతే.. సభలో ఆందోళన చేసి.. తద్వారా సస్పెండ్ అయి.. బయటకు రావాలి. తద్వారా కొంత మేరకు మైలేజీ పొందే అవకాశం ఉంటుంది. కానీ, ఇది సాధ్యమేనా? అన్నది జగన్ ఆలోచన చేయాలి. ఈ రెండు మినహా.. మౌనంగా ఉంటే ప్రజల్లో పలుచన కావడం ఖాయం.