జమిలి ఎన్నికలకు మహారాష్ట్ర చూపిస్తుందా ?
ఇక ఈ రెండు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే కనుక 23న అసలైన ఫలితాలలో ప్రతిబింబిస్తే మాత్రం జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతాయని అంటున్నారు.
By: Tupaki Desk | 21 Nov 2024 4:03 AM GMTదేశంలో రెండు కీలకమైన రాష్ట్రాలకు బుధవారం పోలింగ్ జరిగింది. జార్ఖండ్ లో 68 శాతానికి పైగా పోలింగ్ జరిగితే మహారాష్ట్రలో బాగానే సాగింది. ఇక ఫలితాలు ఈ నెల 23న రానున్నాయి. అయితే దాని కంటే ముందు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ మాత్రం కేంద్రంలో ఎన్డీయే కూటమికి మద్దతుగా ఉండడం విశేషం.
అత్యధిక శాతం ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఈ రెండు రాష్ట్రాలలో ఎన్డీయే కూటమి గెలుస్తుందని కచ్చితంగా చెబుతున్నారు. ఏపీలో 164 సీట్లు టీడీపీ కూటమి గెలుచుకుంటుందని అంచనా వేసిన కేకే సర్వే మహారాష్ట్రలో ఎన్డీయే కూటమికి మొత్తం 225 స్థానాలు లభిస్తాయని అంచనా కట్టింది. దాంతో దీని మీద మరింత ఆసక్తి పెరిగింది.
ఇక జార్ఖండులో మ్యాజిక్ ఫిగర్ ని ఎన్డీయే కూటమి దాటేస్తుందని ఎక్కువ సర్వేలు చెప్పాయి. ఇక ఈ రెండు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే కనుక 23న అసలైన ఫలితాలలో ప్రతిబింబిస్తే మాత్రం జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతాయని అంటున్నారు.
కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఇది అతి పెద్ద బూస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. 2027 మొదట్లో జమిలి ఎన్నికలకు సిద్ధం కావాలని చూస్తున్న బీజేపీ పెద్దలకు ఈ ఎన్నికల్లో ఘన విజయాలు దకితే మాత్రం ఇక నల్లేరు మీద నడకలా జమిలి ఎన్నికలు దూసుకుని వచ్చేస్తాయని అంటున్నారు.
ఇక మహారాష్ట్రలో కనుక బీజేపీ నాయకత్వంలోని కూటమి గెలిస్తే మోడీ ప్రభుత్వానికి అది ఎంతో మోరల్ సపోర్ట్ ఇస్తుందని అంటున్నారు. అదే విధంగా జార్ఖండ్ లో బీజేపీ అత్యధిక కాలం రాజ్యం చేసింది. ఈ దఫా మళ్ళీ గెలుస్తుందని ముందు నుంచి కొంత అంచనా ఉంది.
మరో వైపు చూస్తే ఈ రెండు అసెంబ్లీ ఎన్నికల తరువాత వచ్చే ఏడాది ఢిల్లీ, బీహార్ కి ఎన్నికలు ఉన్నాయి. అయితే వాటిని సైతం బీజేపీ గెలిస్తే ఇక తిరుగు ఉండదని అంటున్నారు. ఆ మీదట 2026లో జరిగే యూపీ ఎన్నికలను మాత్రం వాయిదా వేసి 2027 మొదట్లో జరిగే జమిలి ఎన్నికలతో కలిపేస్తారు అని అంటున్నారు.
ఇక జమిలి ఎన్నికలు కూడా జరిపించేందుకు బీజేపీ మంచి ముహూర్తాలనే వెతుకుతుందని అంటున్నారు. మహారాష్ట్రలో కనుక ఎన్డీయే గెలిస్తే ఇండియా కూటమికి మరింత ఇబ్బంది అవుతుందని రాజకీయంగా ఆ శిబిరంలో నిరాశ కనిపిస్తుందని అదే బీజేపీకి కావాల్సింది అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ నెల 23న వచ్చే మహా ఫలితాలను చూసిన మీదట జమిలి ఎన్నికల మీద దేశంలోని రాజకీయ పార్టీలు ఫుల్ క్లారిటీకు రావచ్చు అని అంటున్నారు. సో వెయిట్ అండ్ సీ.