మోహన్ బాబు, మనోజ్ ఇద్దరు జైలుకు వెళ్తారా?
అయితే... అదంతా అవాస్తవమని విష్ణు పీఆర్వో టీమ్ వెల్లడించింది!
By: Tupaki Desk | 10 Dec 2024 6:53 AM GMTఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైన "మంచు కుటుంబంలో మంటలు" ప్రచారానికి సోమవారం రాత్రికి ఫుల్ క్లారిటీ వచ్చినట్లయ్యిందని అంటున్నారు. ఆదివారం ఉదయం మంచు మోహన్ బాబు అనుచరులు మనోజ్ పై దాడి చేశారని.. ఆ దాడిలో మనోజ్ గాయపడ్డారని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అవి ఒక్కసారిగా సంచలనంగా మారాయి.
అయితే... అదంతా అవాస్తవమని విష్ణు పీఆర్వో టీమ్ వెల్లడించింది! అయితే.. ఆదివారం సాయంత్రం నడవడానికి ఇబ్బంది పడుతూ మనోజ్ ఆస్పత్రి వద్ద ప్రత్యక్షమవ్వడం.. సోమవారం మెడికో లీగల్ రిపోర్ట్ తెరపైకి రావడం.. మనోజ్ కడుపులో, వెన్నెముఖకు గాయలైనట్లు, మెడపై గోళ్లతో రక్కినట్లు గాయాలున్నాయని తెలిసిందని చెప్పడం వైరల్ గా మారింది.
అప్పటికే ఈ వ్యవహారంపై ఓ మోస్తరు క్లారిటీ వచ్చిందని చెబుతుండగా.. సోమవారం ఉదయం మోహన్ బాబు ఇంటి వద్ద బౌన్సర్లు గుమిగూడారని వార్తలు రావడం.. సాయంత్రానికి మనోజ్ నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడం.. అనంతరం మోహన్ బాబు ఫిర్యాదు చేయడం.. ఇద్దరూ తమ తమ ఫిర్యాదుల్లో ప్రాణహాని ఉందని చెప్పడం తీవ్ర సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో మంచు మనోజ్ ఫిర్యాదు మేరకు పహాడీ షరీఫ్ పోలీసులు విజయ్, కిరణ్ తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేయగా.. మోహన్ బాబు ఫిర్యాదు మేరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మనోజ్, మౌనికలపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు! వీరిద్దరిపైనా సెక్షన్ 329, 351 కింద కేసులు నమోదు చేశారని తెలుస్తోంది.
ఆ సంగతి అలా ఉంటే... ఎఫ్.ఐ.ఆర్. నమోదైన తర్వాత ఈ కేసుల విషయంలో పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏమిటనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి సామాన్యులు కొట్టుకుంటే.. ఒకరిపై ఒకరు ప్రాణహాని ఉందని ఫిర్యాదులు చేసుకుంటే ఈపాటికే పోలీసులు రంగంలోకి దిగేవారని అంటున్నారు. అదుపులోకి తీసుకోవడాలు, రిమాండ్ లు మొదలైన ప్రాసెస్ మొదలయ్యేదనే చర్చ మొదలైంది.
ఈ వ్యవహారంలో అటు మనోజ్ - మౌనిక.. ఇటు మనోజ్ ఫిర్యాదు మేరకు కొందరిపై కేసులు నమోదైన పరిస్థితి. ఈ సమయంలో... వారిని ఇప్పటికే స్టేషన్ కి పిలిపించి విచారించాలి కాదా..? కనీసం నోటీసులైనా పంపి ఉండాలి కాదా..? పెద్దలకు ఒకలా సామాన్యులకు ఒకలా వ్యవస్థ పని చేస్తుంటుందా..? అనే గుసగుసలు సోషల్ మీడియా వేదికగా మొదలయ్యాయని అంటున్నారు.
మరోపక్క సుమారు 70 మంది వరకూ బౌన్సర్లు హైర్ చేసుకుని.. వీధి పోరాటాలకు సిద్ధమైనంత పనిచేయడంపైనా చర్చ జరుగుతుందని అంటున్నారు. నాలుగు గోడల మధ్య ఉన్నంత వరకూ అది కుటుంబ సమస్యే అయినప్పటికీ.. ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత వ్యవస్థ తనపని తను చేసుకుపోవాలి కదా..? అనేది మరికొంతమంది అభిప్రాయం అని చెబుతున్నారు.
మరి ఇప్పటికే తండ్రి, చిన్న కుమారుడు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం.. వాటిలో "ప్రాణహాని" ఉందనే విషయాన్ని ప్రాధానంగా ప్రస్థావించారని అంటుండటం.. మరోపక్క విదేశాల్లో ఉన్న పెద్ద కుమారుడు ఇంటికి చేరుకోవడంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకోబోతోందనేది ఆసక్తిగా మారింది.
ఇంత జరిగిన తర్వాత ఈ వ్యవహారం టీకప్పులో తుఫానుగా ముగిసిపోతోందా.. లేక, పెను సంచలనాలకు దారి తీస్తుందా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా... ఎఫ్.ఐ.ఆర్. లు నమోదైన ఈ కేసుల విషయంలో పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏమిటనేది ఆసక్తిగా మారింది.