Begin typing your search above and press return to search.

ఆళ్ళ నానికి టీడీపీ ఎంత దూరం ?

అయితే కొద్ది నెలల నుంచి ఆళ్ల నాని టీడీపీలో చేరుతారు అని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి.

By:  Tupaki Desk   |   4 Jan 2025 1:15 AM GMT
ఆళ్ళ నానికి టీడీపీ ఎంత దూరం ?
X

వైసీపీలో డిప్యూటీ సీఎం హోదాలో ఒక వెలుగు వెలిగిన ఏలూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆళ్ల నాని ఇపుడు ఏ రాజకీయ పార్టీకి చెందని నాయకునిగా ఉన్నారు. ఆయన గత ఆగస్టులో వైసీపీకి రాజీనామా చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని అనాడు ప్రకటించారు.

అయితే కొద్ది నెలల నుంచి ఆళ్ల నాని టీడీపీలో చేరుతారు అని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. దానిని తగినట్లుగా ఆళ్ళ నాని ఎంట్రీకి టీడీపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా చెప్పుకున్నారు. ఇక ఆళ్ళ నాని టీడీపీలో జాయినింగ్ మీద ఒకటి రెండు ముహూర్తాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి.

రీసెంట్ గా చూస్తే కనుక డిసెంబర్ 18న ఆళ్ళ నాని టీడీపీలో చేరుతారు అని కూడా ప్రచారం సాగింది. ఆయన ఏలూరు నుంచి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ద్వారా భారీ కార్ల ర్యాలీతో వెళ్ళి పసుపు కండువా కప్పుకుంటారు అని కూడా ప్రచారం సాగింది.

అయితే ఏమైందో ఏమో కానీ చివరి నిముషంలో అది కాస్తా వాయిదా పడింది. మళ్ళీ ఎపుడు ఆళ్ల నాని టీడీపీలో చేరుతారు అన్నది కూడా ఈ రోజు వరకూ అయితే డేట్ అన్నది ఫిక్స్ కాలేదని అంటున్నారు. ఇక ఆళ్ళ నాని టీడీపీలో చేరే విషయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు పెద్ద ఎత్తున వ్యతిరేకతను తెలియచేస్తున్నారు అని అంటున్నారు

ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే సీనియర్ నేత అయిన బడేటి రాధాకృష్ణయ్య ఆళ్ళ నాని చేరడం అన్నది పార్టీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు అని ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అధినాయకత్వం నిర్ణయం శిరోధార్యం అని కొసమెరుపు మెరిపించారు. మరి లోకల్ లీడర్స్ క్యాడర్ నుంచి వచ్చిన ఒత్తిడి వల్లనే ఆళ్ళ నాని టీడీపీలో చేరిక ఆలస్యం అవుతోందా అన్న చర్చ కూడా సాగుతోంది.

మరో వైపు చూస్తే ఆళ్ల నానిని పార్టీలోకి తీసుకునే విషయంలో టీడీపీ హైకమాండ్ అయితే ఆసక్తిగానే ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. పైగా వైసీపీని వీక్ చేయాలీ అంటే ఆయనను కలుపుకుని ముందుకు వెళ్ళడమే సరైన వ్యూహం అని కూడా భావిస్తున్నారు

ఇక బడేటి రాధాక్రిష్ణయ్యకు ఆళ్ళ నానికి మధ్య ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చునని 2026లో ఎటూ అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి కాబట్టి కొత్తగా చేర్చుకున్నా ఎవరికి ఎక్కడ అకామిడేట్ చేయవచ్చు అన్నది కూడా పార్టీకి స్పష్టమైన అంచనా ఉందని అంటున్నారు.

అయితే ప్రస్తుతానికి ఆళ్ళ నాని చేరిక వాయిదా పడినా సరైన సమయంలోనే ఆయనను పార్టీలోకి తీసుకుంటారు అని అంటున్నారు. ఈ నెలాఖరు నుంచి జగన్ జిల్లాల టూర్లు చేయబోతున్నారు. అలా ఆయన ఏలూరు జిల్లా టూర్ కి వచ్చే సమయంలో ఆళ్ళ నానితో పాటు టోటల్ గా వైసీపీకి మద్దతుగా ఉన్న కీలక నేతలను చేర్చుకుని వైసీపీ అధినేతకు భారీ షాక్ ఇచ్చేలా టీడీపీ ఒక మాస్టర్ ప్లాన్ తో ఉందని అంటున్నారు

ఆ విధంగా చేయడం ద్వారా ఆళ్ళ నాని చేరికకు లోకల్ గా టీడీపీలో ఒక జస్టిఫికేషన్ ఇచ్చినట్లు అవుతుందని కూడా లెక్క వేసుకుంటోంది. మొత్తం మీద చూస్తే ప్రస్తుతానికి ఆళ్ల నానికి టీడీపీ కి మధ్య ఎంత దూరం అంటే చేరువ అయ్యేంతనే అని జవాబు వస్తోంది. మొత్తానికి ఆళ్ళ నాని చేరిక అన్నది గోదావరి జిల్లాలో ఒక బిగ్ పొలిటికల్ సౌండ్ గా ఉండేలా టీడీపీ ప్లాన్ రచిస్తోంది అని అంటున్నారు.