Begin typing your search above and press return to search.

వైసీపీని హర్ట్ చేస్తున్న ఆ నెంబర్

అయితే సభా సంప్రదాయాలు అని చెబుతూ కూటమి వైసీపీని పక్కన పెడుతోంది.

By:  Tupaki Desk   |   22 Nov 2024 11:30 AM GMT
వైసీపీని హర్ట్ చేస్తున్న ఆ నెంబర్
X

ఏపీ అసెంబ్లీలో వైసీపీ పాత్ర ఏమిటి అంటే శాసనసభా పక్షం. ప్రతిపక్ష హోదా అన్నది ఆ పార్టీకి ఎందుకు దక్కదు అంటే అవసరం అయిన సంఖ్యాబలం 18 మంది లేరు అన్నది ప్రభుత్వ వాదన. దాంతో 11 వద్దకే ఆగిపోయిన వైసీపీ తమకు విపక్ష హోదా ఇవ్వాలని కోరుతోంది. ఏకైక విపక్షంగా ఉన్న తమకు ఆ గుర్తింపు దక్కుతుందని కూడా చెబుతోంది.

అయితే సభా సంప్రదాయాలు అని చెబుతూ కూటమి వైసీపీని పక్కన పెడుతోంది. దాంతో వైసీపీ సభకు రావడం లేదు. ఇపుడు పీఏసీకి ఎన్నికలు పెట్టింది ప్రభుత్వం. నిజానికి పీఏసీకి ఎన్నికలు లేకుండానే విపక్షానికి చైర్మన్ పదవి ఇవ్వవచ్చు.

సభలో ఉన్న అన్ని పార్టీల నుంచి సభ్యులను అందులోకి తీసుకుంటారు. ఈ విధంగా పీఏసీ ఏర్పాటు అవుతుంది. ఇది గతంలో నుంచి వస్తున్న సంప్రదాయం. కానీ పీఏసీకి ఎన్నికలు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆ విధంగా చేయడం ద్వారా ఏపీ అసెంబ్లీలో వైసీపీ బలం లేదని చాటి చెబుతున్నారు అని అంటున్నారు.

పీఏసీ లో మెంబర్ కావాలీ అంటే 18 మంది సభ్యుల మద్దాతు ఉండాలి. వైసీపీ 11 మందితోనే ఉంది. దాంతో ఒక్క మెంబర్ ని గెలుచుకోలేదు. ఆ మీదట 12 మంది సభ్యులు ఉన్న కమిటీలో ఏడుగురు అయినా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో పీఏసీ చైర్మన్ పదవి వైసీపీకి అందని పండే అని చెప్పకనే చెప్పేశారు.

అంతే కాదు 18 మంది ఎమ్మెల్యేల మద్దతు మీకు లేదు అని పదే పదే గుచ్చుతున్నారు అని వైసీపీ నేతలు హర్ట్ అవుతున్నారు. దీని మీద వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మాట్లాడుతూ సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా పీఏసీ పోస్టు ఇస్తారని అన్నారు. గతంలో అదే జరిగిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం సంప్రదాయాలను పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు.

మరో వైపు చూస్తే వైసీపీ అధినాయ్కత్వాన్ని మానసికంగా ఇబ్బంది పెట్టేలా 18 నంబర్ ని పదే పదే కూటమి పెద్దలు ముందుకు తెస్తున్నారు అని అంటున్నారు గతంలో 23 అని అనేక విషయాలలో ముడిపెడుతూ వైసీపీ నేతలు కొందరు టీడీపీ మీద ఘాటు విమర్శలు చేసేవారు, సెటైర్లు కూడా పేల్చేవారు.

ఇపుడు వైసీపీకి 18 నంబర్ అంటే షాక్ తినేలా ఉందనిపిస్తున్నారు. ప్రతిపక్ష హొదా కావాలంటే 18 నెంబర్ కావాలి. పీఏసీలో మెంబర్ కావాలీ అంటే 18 మంది సభ్యుల బలం ఉండాలి. ఇదే విధంగా రానున్న రోజులలో కూడా వైసీపీని ర్యాగింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మొత్తానికి ప్రజలు ఇచ్చిన దారుణమైన తీర్పుతో ఇబ్బందులు పడుతున్న వైసీపీకి ఇపుడు 18 నంబర్ చాలా పెద్దగా కనిపిస్తోంది. దాంతో హర్ట్ అవుతోంది. రానున్న రోజులలో ఈ నంబర్ ఇంకెంతలా ఇబ్బంది పెడుతుందో చూడాల్సి ఉంది.