షర్మిల పీసీసీకి ఏడాది....కాంగ్రెస్ డిసైడ్ చేస్తుందా ?
అంత మాత్రాన జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో ఏపీసీసీ అన్నది ముఖ్యం కాదని అనుకుంటే పొరపాటే.
By: Tupaki Desk | 8 Dec 2024 3:45 AM GMTఏపీ కాంగ్రెస్ చీఫ్ అంటే ఒకపుడు ఎంతో పోటీ ఉండేది. ఈ కీలక పదవి కావాలని అంతా ముందుకు వచ్చేవారు. రేసులో అనేకమంది బిగ్ షాట్స్ నుంచి సీనియర్లు జూనియర్లు తేడా లేకుండా డజన్ కొద్దీ పేర్లు వినిపించేవి. కానీ ఏపీలో కాంగ్రెస్ ఓడ బండి అయింది. అందుకే ఆ పదవికి అంతగా పోటీ లేదు. అంత మాత్రాన జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో ఏపీసీసీ అన్నది ముఖ్యం కాదని అనుకుంటే పొరపాటే.
జాతీయ పార్టీల విషయం ఎలా ఉంటుంది అంటే దేశంలో ఒక్కసారిగా పుంజుకుంటే ఆ ప్రభావం రాష్ట్రాల మీద కూడా గణనీయంగా పడుతుంది. దాంతో గాలి ఊదిన బెలూన్ మాదిరిగా ఒక్కసారిగా బిగ్ సైజ్ గా పార్టీ మారిపోతుంది. అలాంటి ఆశలు అయితే ఇపుడు ఏపీ కాంగ్రెస్ నేతలలో ఉన్నాయి.
మూడు సార్లు కేంద్రంలో అధికారం చెలాయిస్తూ వస్తున్న బీజేపీని జమిలి ఎన్నికలు పెట్టినా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్ళినా కూడా జనాలు ఆదరించరని ఒక లెక్క వేసుకుంటున్నారు అయితే హంగ్ రావచ్చు లేదా అన్ని పార్టీలు కలిస్తే కాంగ్రెస్ కి 2004లో మాదిరిగా అధికారం దక్కవచ్చు అన్న చర్చ అయితే ఉంది.
దాంతో కాంగ్రెస్ లో పదేళ్ళుగా ఉంటూ వస్తున్న ఏపీ సీనియర్ నేతలు కేంద్ర పార్టీ పెద్దలతో టచ్ లోకి వస్తున్నారు వారికి ఏపీ పీసీసీ చీఫ్ మీద కన్ను ఉందని అంటున్నారు అదే టైంలో ఆ మధ్య దాకా కాంగ్రెస్ తో సంబంధం ఏ మాత్రం లేని షర్మిలకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం పట్ల కూడా చాలా మంది గుర్రుగా ఉన్నారు అయితే వైఎస్సార్ బ్లడ్ కాబట్టి ఆమె నుంచి ఏమైనా పార్టీ పుంజుకుంటుందేమో అని చూసారు.
కానీ షర్మిల వల్ల కాంగ్రెస్ ఏపీలో బలపడకపోగా మరింతగా ఇబ్బందులో పడిందని అంటున్నారు. ఆమె జగన్ చుట్టూనే తన రాజకీయం నడుపుతున్నారని సీనియర్లు భావిస్తున్నారు. ఆయననే టార్గెట్ చేసుకుంటూ పర్సనల్ అజెండా తీస్తున్నారు అని అంటున్నారు. దాంతో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని పెద్దగా విమర్శించడం లేదని అంటున్నారు.
దీంతో ఏపీలో కాంగ్రెస్ కి ఎదిగేందుకు స్కోప్ ఉన్నా కూడా అది జరగడం లేదని అంటున్నారు. వైసీపీ నుంచి భారీ ఎత్తున ఫిరాయింపులు జరుగుతున్న కూడా కాంగ్రెస్ ఏ ఒక్క నేతనూ ఆకర్షించలేకపోతోంది అని దానికి షర్మిల నాయకత్వ లోపనే కారణం అని వారు అదే పనిగా హైకమండ్ దృష్టిలో పెడుతున్నారుట.
మరో వైపు చూస్తే ఏపీలో షర్మిల నిర్వహించే కార్యక్రమాలకు కూడా పార్టీలో పెద్దలకు సమాచారం ఉండడం లేదని కూడా అగ్ర నాయకత్వం దృష్టికి తెస్తున్నారుట. ఆమె వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ అని వారు వివరించారని ఈ విషయంలో చాలా వరకూ సక్సెస్ అయ్యారని అంటున్నారు.
ఇదిలా ఉంటే 2024 జనవరిలో షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. మరో నెలలో ఆమె పీసీసీ చీఫ్ హోదాకు ఏడాది పూర్తి అవుతుంది అని అంటున్నారు. దాంతో రివ్యూ చేసి మరీ ఆమె పనితీరు పట్ల కేంద్ర కాంగ్రెస్ పెద్దలు ఏ మేరకు సంతృప్తి వ్యక్తం చేశారో కూడా స్పష్టం చేస్తారు అని అంటున్నారు. కొత్త ఏడాది కొన్ని కీలక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేస్తారు అని అంటున్నారు. అందులో ఏపీ కూడా ఉందని అంటున్నారు. మరి షర్మిల పదవి కేవలం ఏడాది మాత్రమే ఉంటుందా లేదా ఆమెకు కొంత దిశానిర్దేశం చేసి కొనసాగిస్తారా అన్నది మాత్రం చూడాలని అంటున్నారు.