ఆ పని షర్మిల వల్ల కాదా ?
జగన్ ని విమర్శిస్తే కాంగ్రెస్ ఎదుగుతుందా అంటే అది కానే కాదు అని అంటున్నారు.
By: Tupaki Desk | 23 Nov 2024 6:30 AM GMTవైసీపీకి ఓటు బ్యాంక్ ఎక్కడ నుంచి వచ్చింది అంటే కాంగ్రెస్ నుంచే అని చెబుతారు. అతి పెద్ద ఓటు బ్యాంక్ గా ఏపీలో వైసీపీ ఎమర్జ్ అయింది అంటే కాంగ్రెస్ ని మొత్తానికి మొత్తం లాగేసిందనే అంటున్నారు. మరి కాంగ్రెస్ ఎదగాలి అంటే ఏమి చేయాలి అన్నది ఇక్కడ ఒక ప్రశ్న. జగన్ ని విమర్శిస్తే కాంగ్రెస్ ఎదుగుతుందా అంటే అది కానే కాదు అని అంటున్నారు.
వైసీపీ ఓటు బ్యాంక్ లో బలమైన ఒక సామాజిక వర్గం ఉంది. అలాగే ఇతర వర్గాలూ ఉన్నాయి. వారికి వైఎస్సార్ ఆరాధ్యుడు. అంతే కాదు టీడీపీ రాజకీయంగా ప్రత్యర్ధి. మరి టీడీపీని గట్టిగా విమర్శిస్తూ ఆ ప్రభుత్వం విధానాల మీద పోరాడితేనే ఆ వర్గాలు కాంగ్రెస్ మీద నమ్మకం పెంచుకుంటాయి. ఆ పార్టీ వైపు వచ్చేందుకు మొగ్గు చూపుతాయి.
ఇక్కడ మరో విషయం ఉంది. ఏపీలో రాజకీయం సామాజిక వర్గం పరంగా చీలిపోయింది. టీడీపీ జనసేన వైసీపీలకు మద్దతు ఇచ్చే మూడు ప్రధాన సామాజిక వర్గాలు ఉన్నాయి. ఏపీ పాలిటిక్స్ మూడు ముక్కలాటగా మారుతోంది. మరి టీడీపీ జనసేన ప్రభుత్వంలో ఉంటూ తమ అధికారిక వాటాను తీసుకుంటే మరో బలమైన సామాజిక వర్గానికి కూడా అధికార వాటా కావాల్సిందే కదా అన్నది ప్రశ్న.
అటువంటపుడు ఆ సామాజిక వర్గం ఏ రాజకీయ పార్టీని ఆశ్రయించి తమ రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకోగలదు అన్నది చూస్తే వైసీపీయే అన్నది ఠక్కున వచ్చే జవాబు. వైసీపీ అయిదేళ్ళ పాటు అధికారంలో ఉన్నపుడు ఆ సామాజిక వర్గానికి చేసినది కొంత అయితే చేయనిది కొంత ఉంది. అలా అసంతృప్తి ఉంది. అది 2024 ఎన్నికల్లో కనిపించింది.
అంతమాత్రం చేత ఆ సామాజిక వర్గం వైసీపీకి పూర్తిగా దూరం అయినట్లు కాదని అంటున్నారు. వారు దూరం అయితే వేరే ఆల్టరేషన్ కూడా లేదని అంటున్నారు. దాంతో వారు వైసీపీతోనే తమ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇక వైసీపీ అధినాయకత్వం కూడా ఓటమి తరువాత ఆ సామాజిక వర్గాన్ని పూర్వం మాదిరిగానే దగ్గరకు చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఇక మరిన్ని సామాజిక వర్గాలు కూడా మొదటి నుంది కాంగ్రెస్ తో అల్లుకుని ఉన్నవి ఇపుడు వైసీపీతో ఉన్నాయి. వాటి రాజకీయ పంధా కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ గా షర్మిల జగన్ మీద చేస్తున్న ఘాటైన విమర్శల వల్ల ఈ సామాజిక వర్గాలు కాంగ్రెస్ వైపు ఎందుకు వస్తాయని అంటున్నారు.
ఏపీ పొలిటికల్ సినారియో చూస్తే వైసీపీ బలంగా ఉండాలనే ఆ సామాజిక వర్గాలు కోరుకుంటాయి. తప్పితే కాంగ్రెస్ బలంగా ఉన్నా ఆ వైపుగా వస్తాయి. కానీ షర్మిల వైసీపీని వీక్ చేసే ప్రయత్నాలు చేస్తూ టీడీపీ కూటమి మీద పెద్దగా విమర్శలు చేయకపోవడంతో ఆ వర్గాలు వైసీపీని మరింత గట్టిగానే అట్టేపెట్టుకుంటాయని అంటున్నారు.
అదే సమయంలో అధికార టీడీపీ మీద కాంగ్రెస్ గట్టిగా పోరాటం చేసి ఎండగడితే ఆ వైపుగా ఎంతో కొంత చూసే చాన్స్ ఉంది కానీ షర్మిల మాత్రం జగన్ మీదనే ఆడిపోసుకుంటూ ముందుకు సాగడం వల్ల కాంగ్రెస్ కి ఏమీ ఒనగూడని పరిస్థితి ఉందని అంటున్నారు. ప్రత్యేకించి ఒక బలమైన సామాజిక వర్గం రాయలసీమలో కాంగ్రెస్ వైపు రావాలని అనుకున్నా షర్మిల యాంటీ జగన్ పాలిటిక్స్ తోనే వెనక్కి పోతున్నారు అని అంటున్నారు.
ఇక్కడ జగన్ షర్మిలలలో తీసుకుంటే జగన్ నాయకత్వంలో ఎపుడైనా తమకు రాజకీయంగా వెలుగు వస్తుందని భావించే ఆ బలమైన సామాజిక వర్గం ఆలోచనలు కూడా దీనిని కారణం అని అంటున్నారు. ఆ సామాజిక వర్గానికి ఒక రాజకీయ వేదికగా వైసీపీ ఉండాలని ఉంది. మరి జగన్ ని ఇబ్బంది పెడుతూ పరోక్షంగా టీడీపీకి మేలు చేసే విధంగా ఏపీ కాంగ్రెస్ చేస్తున్న చర్యలను వారు నిశితంగా గమనిస్తున్నారని అందుకే కాంగ్రెస్ ఎత్తి గిల్లడం లేదని అంటున్నారు.
మొత్తానికి చూస్తే మరో రెండు నెలలలో పీసీసీ చీఫ్ గా ఏడాది పూర్తి చేసుకోబోతున్న షర్మిల వైసీపీ నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని ఎంత వెనక్కి తెచ్చారన్నది ఒక్కసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.