Begin typing your search above and press return to search.

'సిరియా'.. పేరులోనే సిరి.. ప్రపంచంపై మరో యుద్ధ గురి

ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

By:  Tupaki Desk   |   2 Dec 2024 1:30 PM GMT
సిరియా.. పేరులోనే సిరి.. ప్రపంచంపై మరో యుద్ధ గురి
X

ఇప్పటికే దాదాపు మూడేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక 14 నెలలుగా హమాస్ పై విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. మరోవైపు ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య నిత్యం ఉద్రిక్త వాతావరణమే. చైనా ఎప్పుడు తైవాన్ పై విరుచుకుపడుతుందో తెలియదు.. ఇలాంటి సమయంలో ప్రపంచంలో మరో యుద్ధం జరిగితే..? అది కూడా బద్ధ శత్రువులు అమెరికా-రష్యా పరోక్షంగా పాత్ర పోషించే యుద్ధం అయితే?

పదేళ్ల కిందటే..

సిరియా.. ఇరాక్, జోర్డాన్, తుర్కియే, లెబనాన్ లతో సరిహద్దులను పంచుకునే పశ్చిమాసియా దేశం. దీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అత్యంత సన్నిహితుడు. 2011లో అసద్ కు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. వారిని అణచివేయడానికి ప్రయత్నించడంతో అంతర్యుద్ధం మొదలైంది. ప్రభుత్వ దళాలు.. తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణల్లో 6 లక్షల మందిపైగా ప్రజలు చనిపోయారు. నగరాలకు నగరాలే ధ్వంసమయ్యాయి. రష్యాతో పాటు ఇరాన్ అండతో అసద్‌.. అత్యధిక భాగం దేశాన్ని గుప్పిట పట్టారు. రెండు, మూడేళ్లుగా అంతర్యుద్ధం తీవ్రత తగ్గింది.

రెండో పెద్ద నగరం..

సిరియాలో రెండో పెద్ద నగరం అలెప్పో. పదేళ్లుగా సిరియా ప్రభుత్వ అధీనంలోనే ఉన్న ఈ నగరాన్ని బుధవారం తిరుగుబాటుదారులు తమ వశం చేసుకున్నారు. వాస్తవానికి సిరియాలో రష్యా బలగాలు ఇంకా ఉన్నాయి. అయినా, ఇలా జరగడం గమనార్హం. తిరుగుబాటు దారులు అలెప్పో సమీపంలోని హమా నగరం వైపు వెళ్తున్నారు. ఇక్కడ మూడు సైనిక స్థావరాల నుంచి రష్యా దళాలు ఇటీవలే వైదొలగడం గమనార్హం.

అటు రష్యా.. ఇటు అమెరికా

సిరియా తిరుగుబాటుదారులకు అమెరికా మద్దతు ఉంది. తుర్కియే సైన్యం కూడా అండగా దాడులు చేస్తోంది. రష్యాను ఉక్రెయిన్ లో బిజీ చేసి సిరియాలో ఇలాంటి పరిణామాలు జరగడం గమనార్హం. వాస్తవానికి కొన్నేళ్లుగా సిరియాలో ప్రభుత్వం అసద్ దే అయినా.. రష్యా, ఇరాన్ ప్రాబల్యం అధికం. ఇప్పుడు మళ్లీ సిరియా రగడ మొదలైతే అది ఎక్కడకు దారితీసుతుందో చూడాలి.