Begin typing your search above and press return to search.

జగనే దిక్కు...అందరి మాటేనా ?

టీడీపీ అంటే ఒక సామాజిక వర్గం ఓన్ చేసుకుంటుంది అన్న భావన ఉంది.

By:  Tupaki Desk   |   27 Oct 2024 2:30 AM GMT
జగనే దిక్కు...అందరి మాటేనా ?
X

ఏపీ రాజకీయాలు చూస్తే రెండుగా చీలిపోయి చాలా కాలమే అయింది. రెండే కుటుంబాల మధ్యన రాజకీయాలు జరుగుతున్నాయి. ఇపుడు చూస్తే మధ్యలో జనసేన కూడా ఎంటర్ అయింది. ఆ విధంగా చూస్తే బలమైన ప్రధాన సామాజిక వర్గాలకు సంబంధించి వేటికవే పార్టీలు ఉన్నట్లుగా కూడా అనధికారికంగా చెబుతూంటారు.

టీడీపీ అంటే ఒక సామాజిక వర్గం ఓన్ చేసుకుంటుంది అన్న భావన ఉంది. అలాగే జనసేనని మరో బలమైన సామాజిక వర్గం తమదిగా భావిస్తుంది అని అంటారు. వైసీపీ విషయంలో కూడా అలగే ఇంకో సామాజిక వర్గం తన సొంతం అని భావిస్తుందని అంటారు.

అయితే ఈ సొంతం అన్న భావన అయితే 2019 వరకూ ఉండేది, 2024 ఎన్నికలకు వచ్చేసరికి బ్రేక్ అయింది అని కూడా అంటారు. దానికి కారణం సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పి మరీ వైసీపీకి అంగబలం అర్ధబలం దండీగా అందిస్తూ ఒక స్థాయికి తీసుకుని వచ్చిన వారిని పక్కన పెట్టేశారు అన్న బాధ ఉంది.

అందుకే వారు దూరంగా ఉంటూ వచ్చారు. ఫలితంగా వైసీపీకి ఘోరమైన ఓటమి దక్కింది. అయితే ఎనికలు జరిగి ఐదు నెలల తరువాత మెల్లగా ఆ సామాజిక వర్గంలో ఒక భావన కలుగుతోందా పునరాలోచనలు ఏమైనా వస్తున్నాయా అన్నది కూడా చర్చగా ఉంది.

ఇతర పార్టీలలో ఉన్నా తమకు అక్కడ తగిన ప్రాధాన్యత ఉండదని భావిస్తున్న వారు ఈ రోజుకీ వైసీపీలో కొనసాగుతున్నారు అలాంటి వారి గొంతుకగా లేక ఒక బలమైన సామాజిక వర్గం ఆలోచనగా అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీకి చెందిన కీలక నాయకుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తాజాగా సామాజిక మాధ్యమాలలో వదిలిన ఒక వీడియో బైట్ లో సంచలన వ్యాఖ్యలే చేశారు.

ఆయన ఆ ఆ బైట్ లో మాట్లాడుతూ ఇపుడున్న పరిస్థితుల్లో అందరూ జగన్ కి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇది అనివార్యం అని కూడా అన్నారు. ఏపీలో చంద్రబాబుని టీడీపీని ఎదుర్కోవాలంటే జగన్ మాత్రమే దానికి తగిన వారు అని అన్నారు.

విభేదాలు గొడవలు అసంతృప్తులు అన్ని చోట్లా ఉంటాయని వాటిని కాస్తా పక్కన పెట్టి అంతా ఆలోంచాల్సిన సమయం అన్నారు. సైలెంట్ గా క్యాడర్ కానీ లీడర్ కానీ కూర్చుంటే అది మరింత ప్రమాదకరమని కూడా ఆయన అన్నారు. టీడీపీ కూటమి చేస్తున్న అనర్ధాలు అరాచకాల మీద వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా క్యాడర్ తమ పోరాటాన్ని ప్రారంభించాలని ఆయన కోరారు.

మరో వైపు చూస్తే ఏపీలో టీడీపీ కూటమిలో జనసేన బీజేపీ ఉన్నాయి. ఇక విపక్షంలో చూస్తే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. రాయలసీమతో పాటు కొన్ని జిల్లాలలో బలంగా ఉన్న ఒక కీలక సామాజిక వర్గానికి ఇపుడు వైసీపీ తప్ప వేరో చోట రాజకీయం చేయడం అంటే ఇబ్బందే అని అంటున్నారు.

ఏపీలో కూటమిని ఎదుర్కొనేది వైసీపీ తప్ప మరోటి కానే కాదని కేతిరెడ్డి చెబుతున్నారు. జగన్ హాండ్స్ ని బలోపేతం చేయడం ద్వారానే వైసీపీకి పూర్వ వైభవం తెచ్చుకోవచ్చు అని ఆయన అంటున్నారు. ఇక ఏపీలో ప్రతిపక్షం అంటే వైసీపీ కాక మరే పార్టీ ఉందని మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఇటీవల వ్యాఖ్యానించారు.

ఏపీలో మాజీ సీఎం గా అయిదేళ్ళ పాటు పాలించిన జగన్ ఉన్నారు. ఆయనకు అంగబలం అర్ధ బలం ఉన్నాయి. గ్రాస్ రూట్ లెవెల్ వరకూ పార్టీ ఉంది. టీడీపీ కూటమిని ఢీ కొట్టాలీ అంటే వైసీపీయే అన్నది ఈ రోజుకు అయితే రాజకీయ విశ్లేషణగా కూడా ఉంది. అలాగే ఒక బలమైన సామాజిక వర్గం గత నాలుగైదు నెలలుగా డైలామాలో ఉంది.

అయితే అలాంటివి కాకుండా అంతా జగన్ నే సపోర్ట్ చేయాలని కేతిరెడ్డి చెప్పడం పట్ల ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఏది ఏమైనా ఏపీలో వైసీపీ తప్ప మరో పార్టీ విపక్షంలో లేకపోవడం కూడా జగన్ కి హెల్ప్ అవుతోంది. కూటమిలో మూడు పార్టీలు ఉండడం వల్ల విపక్షంలో వైసీపీ సోలోగా మారింది అని అంటున్నారు. ఈ క్రమంలో కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి అని అంటున్నారు.