Begin typing your search above and press return to search.

దేవభూమి లో బీజేపీ పాగా ?

అయినా కానీ దేవుడి పార్టీ బీజేపీ పుట్టి నాలుగున్నర దశాబ్దాలు అయినా కనీసంగా కూడా ఓట్లు తెచ్చుకో లేకపోతోంది.

By:  Tupaki Desk   |   2 Jun 2024 2:09 AM GMT
దేవభూమి లో బీజేపీ పాగా ?
X

దక్షిణాదిన కేరళ రాష్ట్రాన్ని దేవభూమిగా పిలుస్తారు. కేరణలో దేవాలయాలు ఎక్కువ. ఆధ్యాత్మిక కూడా ఉంది. అయినా కానీ దేవుడి పార్టీ బీజేపీ పుట్టి నాలుగున్నర దశాబ్దాలు అయినా కనీసంగా కూడా ఓట్లు తెచ్చుకో లేకపోతోంది.

అటువంటి దేవభూమిలో బీజేపీ కాలూనడం ఈసారి జరుగుతుందని ఎగ్జిట్ పోల్సర్వేలు చెబుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా అన్ని సర్వేలూ బీజేపీకి కేరళలో చోటు ఇచ్చేశాయి. కేరళలో అయితే వామపక్షాలు లేకపోతే కాంగ్రెస్ అన్న వాతావరణమే ఉంది.

అక్కడ బీజేపీ ఎన్ని సార్లు పోటీ చేసినా జనాలు పెద్దగా పట్టించుకున్నది లేదు. ఇరవై ఎంపీ సీట్లు ఉన్న కేరళలో కాంగ్రెస్ కామ్రేడ్స్ మధ్యనే అధికార బదలాయింపు దశాబ్దాలుగా సాగుతోంది. మూడవ పక్షం అన్న మాటే లేదు.

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు బీజేపీ కోరికను తీర్చేలా 2024 ఎన్నికలు ఉన్నాయని అంటున్నారు. కేరళలో బీజేపీకి ఒక్క ఎంపీ సీటు కాదు ఈసారి మూడు దాకా వచ్చే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అంతే కాదు బీజేపీ ప్రభావం ఈసారి చాలానే అక్కడ ఉందని అంటున్నారు.

మొత్తం సీట్లలో బీజేపీ మూడు సాధిస్తే కనుక 15 శాతం సీటు షేర్ ని సాధించినట్లే అంటున్నారు. ఇది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయితే దక్షిణాదిన బీజేపీకి కొత్త రాష్ట్రంలో పట్టు చిక్కినట్లే అంటున్నారు. ఎక్కువగా మైనారిటీలు ఉంటే కేరళలో బీజేపీ పాగా వేయడం అంటూ జరిగితే మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో కూడా ఆ ప్రభావం గణనీయంగా ఉంటుందని అంటున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా కేరళలో ఈసారి అడుగు పెడతామని ధీమా వ్యక్తం చేశారు. ఆయన కాంగ్రెస్ వామపక్షాలను రెండింటి మీద తనదైన విమర్శలు చేస్తూ కొత్త రాజకీయానికి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. మోడీ వచ్చాక ఆపరేషన్ కమలం అంటూ మొదలెట్టిన రాష్ట్రాలలో కేరళ కూడా ఉంది.

దాంతో కేరళలో బీజేపీకి ఈసారి అత్యధిక ఓట్లు కూడా చాలా ఓట్ల వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. మరో రెండేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం తన ఖాతాను తెరవడానికి ఈ ఎంపీ ఎన్నికలు ఎంట్రీ పాస్ గా పనిచేస్తాయని అంటున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజం అయితే బీజేపీకి సౌత్ లో గ్రాండ్ వెల్ కం దేవ భూమి నుంచే స్టార్ట్ అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు అని అంటున్నారు.