Begin typing your search above and press return to search.

మోడీ విష‌యంలో స‌ర్దుబాటు త‌ప్ప‌దా.. బాబు ఏం చేస్తారు..?

మోడీ చేయాల్సిన ప్రాజెక్టుల‌పై బాబు ఒత్తిడి తీసుకువ‌చ్చినా.. పొరుగున ఉన్న ఒడిసా, తెలంగాణ‌లు మోడీపై ఒత్తిడి తెస్తాయి. దీంతో పోల‌వ‌రం, ప్ర‌త్యేక హోదా వంటి అంశాల్లో మోడీ స‌ర్కారు ఏమీ చేయక‌పోవచ్చు.

By:  Tupaki Desk   |   23 Jun 2024 5:01 AM GMT
మోడీ విష‌యంలో స‌ర్దుబాటు త‌ప్ప‌దా..  బాబు ఏం చేస్తారు..?
X

ఏపీకి రావాల్సిన అనేక బిల్లులు పెండింగులో ఉన్నాయి. విభ‌జ‌న చ‌ట్టం ప్రకారం రావాల్సిన‌వి కూడా ఉన్నాయి. ముఖ్యంగా పోల‌వ‌రం విష‌యంలో కేంద్ర‌మే ఆదుకోవాలి. ఇక‌, అమ‌రావతి విష‌యంలోనూ కొన్ని ప్రాజెక్టుల‌కు కేంద్ర స‌హ‌కారం అవ‌స‌రం. ఈ విష‌యంలో మోడీ ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది గ‌త ఐదేళ్లు చూశాం. నిజానికి జ‌గ‌న్ అనేక సంద‌ర్భాల్లో మోడీని ప్ర‌శ్నించిన మాట వాస్త‌వం. ఢిల్లీ వెళ్లినా.. లేక మోడీనే ఢిల్లీ నుంచి ఏపీకి వ‌చ్చినా.. పోల‌వ‌రం విష‌యంలో ప్ర‌శ్నించారు.

దీనిని అప్ప‌ట్లో టీడీపీ అనుకూల మీడియాలోనూ ప్ర‌సారం చేశారు. కానీ, మోడీ మ‌న‌సు క‌ర‌గ‌లేదు. అయి తే.. అప్ప‌ట్లో ఆయ‌న‌కు బ‌ల‌మైన ఎంపీలు ఉన్నారు. చెక్కు చెద‌ర‌ని మెజారిటీ కూడా ఉంది. దీంతో ఎవ‌రి మాటా వినిపించుకోలేదు. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారింది. కేంద్రంలో ఎన్డీయే కూట‌మి స‌ర్కారు ఉంది. దీంతో కొంత మేర‌కు సాధించే అవ‌కాశం ఉంది. కానీ. ఇక్క‌డ కూడా.. మోడీని శాసించే ప‌రిస్థితి మాత్రం క‌నిపించ‌డం లేదు. గ‌తంలో జ‌గ‌న్ ఎలా అయితే.. స‌ర్దుబాటు రాజ‌కీయాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యారో.. ఇప్పుడు బాబు ప‌రిస్థితి కూడా ఉంది.

మోడీ చేయాల్సిన ప్రాజెక్టుల‌పై బాబు ఒత్తిడి తీసుకువ‌చ్చినా.. పొరుగున ఉన్న ఒడిసా, తెలంగాణ‌లు మోడీపై ఒత్తిడి తెస్తాయి. దీంతో పోల‌వ‌రం, ప్ర‌త్యేక హోదా వంటి అంశాల్లో మోడీ స‌ర్కారు ఏమీ చేయక‌పోవచ్చు. అలాగ‌ని చంద్ర‌బాబు వ‌దిలేయ‌క‌పోయినా.. నిరంత‌రం ప్ర‌శ్నించినా.. మోడీ కూడా..నిరంత‌రం వాటిని వాయిదా వేయొచ్చు. జ‌గ‌న్ హ‌యాంలో ఎలా అయితే.. విని కూడా విన‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారో.. ఇప్పుడు బాబు హ‌యాంలోనూ ఇదే జ‌రిగినా ఆశ్చ‌ర్యం లేదు. అయితే.. కొన్ని విష‌యాలు మాత్రం క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

తాజాగా అమ‌రావ‌తికి రైల్వే లైన్లు ఇచ్చారు. ఇది పెద్దగా మోడీకి ఇబ్బంది క‌రం కాదు. ఇక‌, వెనుక బ‌డిన జిల్లాల‌కు నిధులు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇదీ చేయొచ్చు. అదేస‌మ‌యంలోగ‌తంలో జ‌గ‌న్‌కు ఇచ్చిన వెసులు బాటు చంద్ర‌బాబు ల‌భించ‌నుంది. అదే.. అప్పులు విష‌యంలో వెసులుబాటు. ఎక్క‌డ నుంచి ఎలా తెచ్చుకున్నా.. గ‌తంలో జ‌గ‌న్‌కు మోడీ అభ‌యం ఇచ్చారు. సొంత రాష్ట్రం గుజ‌రాత్‌కు కూడా ఇవ్వ‌నంత అప్పులుఏపీకి ఇచ్చేలా చేశారు. సో.. ఇలా చేయొచ్చు. ఇంత‌కు మించి చంద్ర‌బాబు బ‌లవంతం చేసేందుకు అవ‌కాశం.. మోడీ లొంగిపోయే ఛాన్స్ కూడా క‌నిపించ‌డం లేదు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. తుమ్మ‌తే ఊడే ముక్కు మాదిరిగానే ఈ ఎన్డీయేలో పార్టీల‌తో మోడీ బంధం ఉంది.