ఏపీ కాంగ్రెస్ కి చిరంజీవి సారధ్యం వహిస్తారా...
ఆయన వంటి మేటి నాయకుడు లీడ్ చేయబట్టే కాంగ్రెస్ మళ్లీ ఊపిరిపోసుకుందని అంతా అంటారు కాంగ్రెస్ కి గ్రాస్ రూట్ లెవెల్ లో బలం ఉంది.
By: Tupaki Desk | 8 Dec 2023 2:45 AM GMTచిరంజీవి రాజకీయాలు వదిలిపెట్టి తన మానాన సినిమాలు చేసుకుంటున్నారు. అయన ఏడు పదులకు చేరువలో ఉన్నారు. అయితే రాజకీయాలలో వయసు ఎపుడూ అడ్డం కాదు పైగా ప్లస్ అవుతుంది కూడా. ఈ నేపధ్యంలో చిరంజీవి ఫిజికల్ గా కూడా ఫిట్ అన్నది తెలిసిందే. ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించి తరువాత కాలంలో కాంగ్రెస్ లో విలీనం చేశారు.
ఇక చిరంజీవి దానికి ప్రతిఫలంగా రాజ్యసభ మెంబర్ అయ్యారు. కేంద్ర మంత్రిగా రెండున్నరేళ్ల పాటు కేంద్రంలో యూపీఏ టూ ప్రభుత్వంలో పనిచేశారు. ఇదిలా ఉంటే 2018లో చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం ముగిసింది. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ కి దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణాలో కాంగ్రెస్ దాదాపుగా పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చింది. దానికి కారణం రేవంత్ రెడ్డి సారధ్యం. ఆయన వంటి మేటి నాయకుడు లీడ్ చేయబట్టే కాంగ్రెస్ మళ్లీ ఊపిరిపోసుకుందని అంతా అంటారు కాంగ్రెస్ కి గ్రాస్ రూట్ లెవెల్ లో బలం ఉంది. కాంగ్రెస్ కి ప్రతీ పోలింగ్ బూత్ లో కొన్ని ఓట్లు ఉంటాయి. కాంగ్రెస్ గుర్తు తెలియని వారు లేరు.
అయితే కాంగ్రెస్ ని నడిపించగలిగే చరిష్మాటిక్ లీడర్ షిప్ ఉంటే అద్భుతాలు సృష్టిస్తుంది అన్నది తెలంగాణా కాంగ్రెస్ విజయంతో బోధపడింది. ఇక కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి రూపంలో తెలంగాణాలో మంచి నాయకుడు దొరికారు. మరి ఏపీలో కూడా కాంగ్రెస్ ఉంది. నిజానికి కాంగ్రెస్ కి ఏపీలోనే ఎక్కువ బలం ఉంది.
కానీ కాంగ్రెస్ ఇపుడు కకావికలం కావడానికి కారణం సరైన లీడర్ షిప్ లేకపోవడమే అని అంటారు. కాంగ్రెస్ కి మంచి రోజులు వస్తున్నాయని తెలంగాణాలో రుజువు అయిన వేళ ఏపీలో కూడా మంచి నాయకత్వం కోసం కాంగ్రెస్ హై కమాండ్ వెతుకుతోంది. కాంగ్రెస్ బండి ని నడిపించే నాధుడు ఏపీలో దొరకాలి. ఇదిలా ఉంటే చిరంజీవి రేవంత్ రెడ్డి సీఎం గా అయిన సందర్భంగా ఆయనకు గ్రీట్ చేశారు. అభినందనలు కూడా అందించారు.
ఈ క్రమంలోనే రాజకీయంగా ఇది చర్చకు తావిస్తోంది. చిరంజీవి టెక్నికల్ గా ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉన్నారు అని చెప్పాలి. ఆ మధ్యన ఏఐసీసీ ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగితే చిరంజీవికి కూడా ఓటు ఇస్తూ మెంబర్ షిప్ ని అలాట్ చేశారు. అంటే కాంగ్రెస్ దృష్టిలో చిరంజీవి ఈ రోజుకీ తమ పార్టీ వారే. మరి రేవంత్ రెడ్డికి రెండు రాష్ట్రాల బాధ్యతలు కాంగ్రెస్ హై కమాండ్ అప్పగించవచ్చు.
ఆయన ఏపీలో సమర్ధ నాయకత్వాన్ని చూడాల్సి ఉంది. చిరంజీవి కాంగ్రెస్ మనిషే కాబట్టి ఆయన ఏమైనా తిరిగి రాజకీయంగా ముందుకు వస్తారా అన్నది కూడా చర్చకు వస్తోంది. చిరంజీవి వంటి మెగాస్టార్ వస్తే ఏపీలో కాంగ్రెస్ కూడా ముందుకు దూసుకువస్తుందని అంటున్నారు. మరి మెగాస్టార్ ఆలోచనలు ఏమిటి అన్నది చూడాలి.
అయితే తన సొంత ఇంట్లోనే తమ్ముడి జనసేన పార్టీ ఉన్నా ఆ వైపు తొంగి చూడని చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి వస్తారా అన్నది పెద్ద ప్రశ్న. ఆయన ఇక చాలు పాలిటిక్స్ అని వదిలేసుకున్న తరువాత కాంగ్రెస్ నేతలు ప్రయత్నం ఏమైనా చేస్తారా అంటే రాజకీయాల్లో ఎపుడూ ఎండింగ్ ఉండదు, సో తలుపు అన్నీ తెరచే ఉంటాయి. మరి కాంగ్రెస్ సారధ్యం చిరంజీవి వహిస్తే ఒక బలమైన సామాజిక వర్గం కూడా ఏపీలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యే చాన్స్ ఉంటుంది అని అంటున్నారు. ఇదంతా సోషల్ మీడియాలో జస్ట్ ఊహాగానాలు మాత్రమే. ఏమి జరుగుతుందో కాలం నిర్ణయిస్తుంది వెయిట్ అండ్ సీ.