జగన్ షర్మిలకు కౌంటర్ ఇస్తారా...!?
ఏపీలో రాజకీయ పరిణామాలు మారిన వేళ ముఖ్యమంత్రి పాల్గొంటున్న సభ ఇదే కావడంతో దాని మీద సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది
By: Tupaki Desk | 22 Jan 2024 5:23 PM GMTముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 23న అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఆయన ఉరవకొండలో మీటింగ్ కి హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.
ఏపీలో రాజకీయ పరిణామాలు మారిన వేళ ముఖ్యమంత్రి పాల్గొంటున్న సభ ఇదే కావడంతో దాని మీద సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఈ వారంలోనే జగన్ సొంత చెల్లెమ్మ వైఎస్ షర్మిల కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ గా ప్రమాణం చేశారు. ఆ వెంటనే ఆమె రాష్ట్ర ప్రభుత్వం మీద ఘాటు విమర్శలు చేశారు.
ఆమె జగన్ ని నేరుగానే ఎటాక్ చేశారు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా సహా మరే విషయంలోనూ కేంద్రం మీద వత్తిడి పెంచలేదని కూడా తప్పుపట్టారు. బీజేపీతో వైసీపీ రాజీ పడిందని కూడా షర్మిల కామెంట్స్ చేశారు.
ఇక ఏపీలో అభివృద్ధి లేదు కనీసం జీతాలు కూడా సకాలంలో అందడంలేదు అంటూ వ్యంగ్యోక్తులు కూడా విసిరారు. ఇవన్నీ వైసీపీకి మంట పుట్టించేవే. దాని మీద గత రెండు రోజులుగా సజ్జల రామక్రిష్ణారెడ్డి నుంచి చాలా మంది నేతలు కౌంటర్లు ఇచ్చారు.
అయ్తే జగన్ చెల్లెలు ఈ విధంగా అన్న మీద విమర్శలు తీవ్ర స్థాయిలో చేయడంతో జగన్ కూడా దానికి ధీటైన బదులు ఇస్తారా అన్న చర్చకు తెర లేస్తోంది. సాధారణంగా జగన్ ఎవరినీ డైరెక్ట్ గా పేరు పెట్టి విమర్శించారు. ఆయన ఒక్క చంద్రబాబునే నేరుగా విమర్శిస్తారు. పవన్ పేరు ఆయన ఎపుడూ ప్రస్తావించలేదు. ప్యాకేజి స్టార్ అని దత్తపుత్రుడు అని ఆయన విమర్శిస్తూంటారు
అలాంటిది ఇపుడు షర్మిలకు జగన్ కౌంటర్ ఇస్తారా లేదా అన్నది చర్చగా ఉంది. కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే ఆమె కూడా వైఎస్సార్ వారసురాలే. అందువల్ల ఇప్పటి నుంచే గట్టిగా కౌంటర్ చేయకపోతే ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. లైట్ తీసుకుంటే ఇబ్బంది అని అంటున్న వారూ ఉన్నారు.
నేరుగా తన ప్రభుత్వం మీద తన మీద షర్మిల చేసిన కామెంట్స్ కి జగన్ అదే స్థాయిలో జవాబు చెబితేనే బాగుంటుంది అని అంటున్న వారూ ఉన్నారు. జగన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలని అంటున్నారు. జగన్ అయితే గతసారి మీటింగులో తన కుటుంబాన్ని చీల్చుతున్నారు అని చంద్రబాబు సహా విపక్షాల మీద విమర్శలు చేశారు. ఈసారి ఆయన కాంగ్రెస్ మీద కూడా విమర్శలు చేసే అవకాశం ఉంటుంది.
అయితే రాజకీయాల్లో ప్రత్యర్ధుల విషయంలో తూకంగానే విమర్శలు చేస్తారు. ఎందుకంటే విమర్శలు చేస్తే అవతల వారి ప్రాధాన్యత పెరిగిపోతుంది అని అపుడు తామే కోరి పెంచినట్లుగా ఉంటుందని కూడా భావిస్తారు. ఆ లెక్కలు వేరేగా ఉంటాయి. అందుకే జగన్ ఇండైరెక్ట్ గానే కౌంటర్ ఇవ్వవచ్చు అని అంటున్నారు.
అది కూడా ఏపీకి కాంగ్రెస్ చేసిందేమీలేదని అడ్డగోలు విభజన తో పాటు ఏపీ ఇలా అన్ని రకాలుగా ఇబ్బందులు కావడానికి కాంగ్రెస్ కారణం అని విమర్శలు చేయవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి జగన్ ఎలా రియాక్ట్ అవుతారో.