జగన్ పులివెందుల వదలాల్సిందేనా...బాబు స్కెచ్ ఏంటి ?
2029 ఎన్నికల్లో జగన్ పులివెందుల నుంచి పోటీ చేయడం కుదరదా అంటే రాజకీయాల్లో జవాబులు చెప్పడం అంత సులువు కాదు.
By: Tupaki Desk | 17 Jun 2024 12:30 AM GMTపులివెందుల అంటే వైఎస్సార్ ఫ్యామిలీయే గుర్తుకు వస్తుంది. ఆ నియోజకవర్గంలో వైఎస్సార్ ఫ్యామీలీ ప్రజా ప్రాతినిధ్యానికి 2028 నాటికి అక్షరాలా అర్ధ శతాబ్ది కాలం పూర్తి అవుతుంది. ఇంతలా ఒక నియోజకవర్గాన్ని అట్టే బెట్టుకుని వరస విజయాలతో ప్రభావితం చేసిన కుటుంబం దేశ రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటుంది.
ఆ క్రెడిట్ అయితే వైఎస్సార్ ఫ్యామిలీదే. అయితే ఆ ముచ్చట ఎంతో కాలం సాగదా అంటే అనేక డౌట్లు వస్తున్నాయి. 2029 ఎన్నికల్లో జగన్ పులివెందుల నుంచి పోటీ చేయడం కుదరదా అంటే రాజకీయాల్లో జవాబులు చెప్పడం అంత సులువు కాదు. ఈ టెర్మ్ లో గెలవడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఎన్నో జాక్ పాట్ లని కొట్టేసింది. అందులో ఒకటి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ సమయానికి టీడీపీ అధికారంలో ఉండడం.
దేశంలో చివరి సారిగా 2006లో అసెంబ్లీ నియోజకవర్గాలు లోక్ సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అలా కొత్త సీట్లతో 2009లో ఎన్నికలు జరిగాయి. మళ్ళీ 2026లో ఆ చాన్స్ ఉంది. ప్రత్యేకించి విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఏపీ తెలంగాణా అసెంబ్లీ సీట్లను పెంచుకునే వెసులుబాటు కూడా 2026లో కలిగిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 సీట్లను కాస్తా 225కి విభజన చట్టం ప్రకారం పెంచుతారు.
అదే విధంగా తెలంగాణాలో 119 సీట్లను కాస్తా 150 సీట్ల దాకా పెంచుతారు. ఇక దేశవ్యాప్తంగా లోక్ సభ స్థానాల పునర్ వ్యవస్థీకరణ కూడా 2026లో ఉండబోతోంది. దాంతో ఏపీలో టీడీపీకి ఇది మంచి అవకాశం అని అంటున్నారు.
ఇక గతంలో అంటే 2006లో అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన జరిగింది. ఆ టైం లో వైఎస్సార్ అధికారంలో ఉన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది. దాంతో తమకు అనువుగా నియోజకవర్గాలను ముక్కలు చేసారని టీడీపీకి బలమున్న చోట్ల విడగొట్టారని నాడు ఆరోపణలు ఉన్నాయి.
ఇపుడు అదే రకమైన పరిస్థితి ఉండబోతోందా అంటే రాజకీయాలు కదా డౌట్లు ఎందుకు అంటున్నారు. ఈసారి పునర్విభజన జరిగితే కచ్చితంగా జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మీదనే ఫోకస్ పెడతారు అని అంటున్నారు. దానిని ఎస్సీ రిజర్వుడు గా చేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను సైతం ఎప్పటికప్పుడు రొటేట్ చేస్తుంటారు. అలా మార్పులు చేసినపుడు జనరల్ క్యాటగిరీలో ఉన్నవి రిజర్వుడుగా మారిపోతాయి. అధికారంలో ఉన్న వారు తమ సేఫ్ చూసుకుంటారు. విపక్షాల మీద అస్త్రాన్ని ప్రయోగిస్తూంటారు. అలా జగన్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న పులివెందుల మీద టీడీపీ కచ్చితంగా ఫోకస్ చేస్తుంది అని అంటున్నారు.
ఎటూ కేంద్రంలో మద్దతు ఇచ్చే ప్రభుత్వం ఉంటుంది కాబట్టి టీడీపీ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోతుంది అని అంటున్నారు. అంతే కాదు 175 నుంచి 225 సీట్లు పెంచుకుని తనకు అనుకూలంగా అంతా చేసుకుని 2029 ఎన్నికల నాటికి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ చూస్తుంది అని అంటున్నారు.
కేవలం జగన్ నియోజకవర్గం అనే కాదు వైసీపీకి ఎక్కడ బలం ఉందో అక్కడ తన అస్త్రాలను వాడుతారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మాత్రం మరో రెండేళ్లలో అసలైన రాజకీయ క్రీడ మొదలవుతుంది అని అంటున్నారు. ఇవన్నీ తట్టుకుని వైసీపీ నిలబడాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఈ పునర్విభజన కమిషన్ ను రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు ఇందులో సభ్యులుగా ఉంటారు. కమిషన్ తీసుకునే నిర్ణయాలను సవాల్ చేసే వీలు ఉండదు అని అంటున్నారు. సో అలా ముందుకు సాగిపోవడమే అన్న మాట.