Begin typing your search above and press return to search.

లివింగ్ లో మోసపోయిన ప్రియాసింగ్ కు న్యాయం జరుగుతుందా?

ఇందులో ప్రేమ, పెళ్లి, వివాహం చేసుకున్న వారు కొంత కలిసి, మెలిసి ఉంటున్నా సహజీవనం ఉచ్చులో పడిన ఎందరో మంది మోసపోతూనే ఉన్నారు.

By:  Tupaki Desk   |   18 Dec 2023 2:45 AM GMT
లివింగ్ లో మోసపోయిన ప్రియాసింగ్ కు న్యాయం జరుగుతుందా?
X

నేటి సమాజంలో ప్రేమ, పెళ్లి, కులాంతర, మతాంతర వివాహాలు, లివ్ ఇన్ పరిపాటిగా మారింది. ఇందులో ప్రేమ, పెళ్లి, వివాహం చేసుకున్న వారు కొంత కలిసి, మెలిసి ఉంటున్నా సహజీవనం ఉచ్చులో పడిన ఎందరో మంది మోసపోతూనే ఉన్నారు. ఈ ఉదంతాలు ఎక్కడో ఒక చోట తెరమీదకు వస్తూనే ఉన్నాయి. అయినా యువతీ యువకులు ఈ ఉచ్చు నుంచి బయటపడడం లేదు. ఇలాంటి ఓ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

మాయమాటలు నమ్మి.. ఆపై మోసపోయి..

మహారాష్ట్రకు చెందిన ప్రియాసింగ్‌ సమాజంలో అత్యున్నత హోదాలో ఉన్న ఓ సీనియర్‌ బ్యూరోక్రాట్‌ కుమారుci అశ్వజిత్‌ గైక్వాడ్‌తో నాలుగన్నరేళ్లు సహజీవనం చేసింది. అతన్ని నమ్మింది. కానీ అతడు ఆమెను మాటలతో మోసం చేశాడు. తన పెళ్లి విషయాన్ని బయటపెట్ట కుండా మేనేజ్ చేశాడు. చివరికి విషయం ఆమెకు తెలిసినా అతడిని మళ్లీ గుడ్డిగా నమ్మింది.

ప్రశ్నించినా బుకాయింపే..

తనకు ఇంతకు ముందే వివాహం జరిగిందని ఎందుకు చెప్పలేదని? ప్రియాంక సింగ్ అశ్వజిత్ ను ప్రశ్నించింది. వెంటనే ఆయన పరిస్థితికి అనుగుణంగా మాట మార్చాడు. తను, తన భార్య ఎప్పుడో విడిపోయామని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నామని, జీవితాంతం నీతోనే ఉంటానని చెప్పడంతో ఆ మాటలను ఆమె నిజమని నమ్మింది. అతను ఏది చెప్పినా గుడ్డిగా సరే అంది. ఈ క్రమంలో తెల్లవారు జామున ఫోన్‌ చేసి కలుద్దామని అశ్వజిత్ ఫోన్‌ చేసి ప్రియాసింగ్‌ ను పిలిపించాడు. ఎక్కడ కలువాలో కూడా లొకేషన్‌ షేర్‌ చేశాడు. తీరా అక్కడికి వెళ్లితే తన బాయ్‌ఫ్రెండ్‌, తన భార్య, దగ్గరి స్నేహితులతో కనిపించడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌‌‌కు గురైంది. వ్యక్తిగతంగా మాట్లాడాలని అడిగినా అందుకు అతను ఒప్పుకోలేదు.

తెలియనట్లు నటించి.. చివరికి..

సహజీవనం చేసిన ప్రియాసింగ్ ఎవరో తెలియనట్లు అశ్వజిత్ అరిచి నానా హంగామా చేశాడు. పైగా ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇదంతా జరిగిన తర్వాత ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. చివరికి తన డ్రైవర్‌ సాయంతో కారును ఆమెపై ఎక్కించి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం పరారయ్యాడు. ప్రస్తుతం తీవ్రగాయాలపాలై ఆమె చికిత్స పొందుతున్నది. అంతా అయిపోయాక బాయ్‌ఫ్రెండ్‌ తనను మోసం చేశాడంటూ కేసు పెట్టింది. ఇక్కడ ఆమె బాయ్‌ఫ్రెండ్‌ ఎవరో కాదు.. మహారాష్ట్ర స్టేట్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ గైక్వాడ్‌ కొడుకు అశ్వజిత్. వీరికి చాలా పరపతి, అధికారం ఉంది. మరి ఆమెకు ఎంత వరకు న్యాయం జరగుతుందనేది తెలియదు. మరి కేసు నడుస్తుందా? లేక బుట్టదాఖలవుతుందా? అన్నది కూడా డౌటే. పోలీసులు విచారణ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ఈ బంధాలు అంతేనా?

వివాహేతర సంబంధాలు, లివింగ్ ఎప్పటికీ చివరి వరకు నిలవవు. ఇందులో చివరికి ఎవరో ఒకరు బలి కావాల్సిందే.. ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లిలు కొన్ని మూన్నాళ్ల ముచ్చటగా అవుతున్నా.. కాపురంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే పెద్దలు, కోర్టులు చూసుకుంటాయని భరోసా ఉంటుంది. అయితే సహజీవనం జీవితాంతం సాగుతుందని ఎవరూ అనుకోరు. పైగా అదో మాయా ప్రపంచం. ఇలాంటి బంధాల్లో తమకు ఎవరి మద్దతు, అండదండ లభిస్తుందో ఆలోచించాలి. ఆ తర్వాత ఎదురయ్యే సమస్యలను అధిగమించగలడం సాధ్యమేనా? అంటే కాకపోవచ్చు.