Begin typing your search above and press return to search.

చీల్చుడు పాలిటిక్స్ : జార్ఖండ్ లో కమలం వికసిస్తుందా...!?

ఆయన తరఫున చంపై సోరేన్ కొత్త ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటే ఆయనకు రాజ్ భవన్ కరుణ కలగడంలేదు.

By:  Tupaki Desk   |   2 Feb 2024 3:41 AM GMT
చీల్చుడు పాలిటిక్స్ : జార్ఖండ్ లో కమలం వికసిస్తుందా...!?
X

అధికారం అందుకోవాలంటే ప్రజల మద్దతు ఉండాలి. ఒక్కసారి ప్రజలు ఓటేశాక కూడా అధికారం అందుకోవాలంటే వేరే మార్గాలు ఉన్నాయి. అవేంటో కాంగ్రెస్ కి బాగా తెలుసు. బీజేపీకి కూడా ఇంకా బాగా తెలుసు. గతంలో మధ్యప్రదేశ్, కర్నాటకలో ప్రభుత్వాలను ఎలా బీజేపీ ఏర్పాటు చేసింది అన్నది తెలిసిందే. కాంగ్రెస్ ని నిలువునా చీల్చేసింది.

ఇపుడు జార్కండ్ మీద ఫోకస్ పెట్టింది. అందుకే సడెన్ గా అక్కడ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ అరెస్ట్ అయిపోయారు. ఆయన తరఫున చంపై సోరేన్ కొత్త ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటే ఆయనకు రాజ్ భవన్ కరుణ కలగడంలేదు. నలభై మూడు మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని చంపై సోరెన్ వర్గం గవర్నర్ ని కలసి రెండు సార్లు విన్నవించింది.

అయినా చూద్దాం అన్నదే రాజ్ భవన్ వైఖరిగానే ఉంది అంటున్నారు. ఇక్కడ ఒక ముచ్చట చెప్పుకోవాలి. బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వం ఉదయం రాజీనామా చేసి సాయంత్రానికి బీజేపీతో చేతులు కలిపి మళ్లీ కొత్త సర్కార్ ఏర్పాటు చేసింది.

మరి అంత వేగంగా అక్కడ గవర్నర్ వ్యవహరిస్తే ఇక్కడ పూర్తి మెజారిటీ ఉందని చెబుతున్నా కూడా ఎందుకు గవర్నర్ తాత్సారం చేస్తున్నారు అన్నది జార్ఖండ్ ముక్తీ మోర్చా అధినాయకత్వానికి అర్ధం కావడం లేదుట. చీల్చుడు పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయని అనుమానిస్తున్నారుట.

అందుకే తమ వర్గం ఎమ్మెల్యేలను జాగ్రత్తగా క్యాంప్ పెట్టి మరీ హైదరాబాద్ కి తరలించాలని చూసినా ప్రకృతి కూడా సహకరించలేదు. దాంతో ప్రత్యేక విమానం ఆగింది. ఇదిలా ఉంటే జార్ఖండ్ లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను బీజేపీ పరిశీలిస్తోంది అని అంటున్నారు.

జార్ఖండ్ శాసన సభలో మొత్తం 81మంది సభ్యులు ఉంటారు. ఇందులో మిత్రులతో కలుపుకుని 41 మంది జార్ఖండ్ ముక్తీ మోర్చాకు ఉన్నారు. కాంగ్రెస్,ఆర్జేడీకి కలిపి అరు సీట్లు ఇందులో ఉన్నాయి. బీజేపీకి అయితే సొంతంగా 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిత్రపక్షం అయిన ఏజేఎస్ యూకి మూడు సీట్లు ఉన్నాయి. దాంతో 35కి బీజేపీ బలం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఆరుగురి ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అందుకోసం సోరెన్ పార్టీలో చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోంది అని అంటున్నారు.

అయితే దీనికి తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ సహా ఇతర విపక్షాల సాయం జార్ఖండ్ ముక్తీ మోర్చా తీసుకుంటోంది. మరి జార్ఖండ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందా అంటే సోరెన్ రాజీనామా చేయడమే ఇపుడు పెద్ద దెబ్బ విపక్షానికి అన్నట్లుగా సీన్ ఉంది. సో బీజేపీ ప్రయత్నాలు ఫలిస్తే మాత్రం మొత్తం విపక్ష కూటమికే పెద్ద షాక్ అని చెప్పాల్సి ఉంది.