Begin typing your search above and press return to search.

లోకేష్ అరెస్టూ తప్పదా ?

స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కామ్ లో చంద్రబాబునాయుడును అరెస్టుచేసిన సీఐడీ గురి నారా లోకేష్ మీదా ఉన్నట్లు అర్ధమవుతోంది.

By:  Tupaki Desk   |   10 Sep 2023 5:28 AM GMT
లోకేష్ అరెస్టూ తప్పదా ?
X

స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కామ్ లో చంద్రబాబునాయుడును అరెస్టుచేసిన సీఐడీ గురి నారా లోకేష్ మీదా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఏదోరోజు సడెన్ గా లోకేష్ ను అరెస్టుచేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. స్కిల్ సెంటర్ కుంభకోణంతో పాటు ఇతర కుంభకోణాల్లో లోకేష్ పాత్రపైన లోతుగా దర్యాప్తు జరుగుతోందని సీఐడీ చీఫ్ సంజయ్ మీడియాతోనే చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కామ్ తో పాటు ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల్లో కూడా లోకేష్ పాత్రుందని సీఐడీ అభిప్రాయపడుతోంది.

అయితే లోకేష్ పాత్రపై అవసరమైన ఆధారాల సేకరణలో బిజీగా ఉన్నారు. తాము అనుకున్నట్లుగా ఆధారాలు గనుక దొరికితే వెంటనే లోకేష్ అరెస్టు జరుగుతుందని అర్ధమవుతోంది. 2014-19 టీడీపీ ప్రభుత్వంలో లోకేష్ మూడు శాఖలకు మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. పైగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో లోకేష్ కు అత్యంత సన్నిహితుడైన కిలారు రాజేష్ పాత్రను సీఐడీ పదేపదే ప్రస్తావించింది. తనకు బినామీగా కిలారును లోకేషే ప్రవేశపెట్టారని సీఐడీ అనుమానిస్తోంది.

జరిగిన కుంభకోణంలో లోకేష్ పాత్రపై ఇప్పటికే అధారాలు దొరికినా ఇవి సరిపోవని మరికొన్ని ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నట్లు సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. అందుకనే అంత ధైర్యంగా లోకేష్ పాత్రపైన కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు సంజయ్ మీడియాతో చెప్పారని తెలుస్తోంది. ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలకు లోకేష్ పాత్రపైన సరైన ఆధారాలు దొరికాయని సంజయ్ చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లోనే లోకేష్ పాత్రపై మరింత లోతైన దర్యాప్తు జరుగుతోంది.

లోకేష్ పాత్రపైన దర్యాప్తు చేస్తునే మాజీమంత్రి, టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పాత్రపైన కూడా ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు ఏ1 అయితే అచ్చెన్నాయుడు ఏ2గా ఉన్నారు. ఇక మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన కొడుకును కూడా సీఐడీ అరెస్టుచేసింది. వీళ్ళ అరెస్టుకు కారణం ఏమిటంటే షెల్ కంపెనీల ఏర్పాటనే అని తెలుస్తోంది. పైగా సీమెన్స కంపెనీతో ప్రభుత్వానికి ఒప్పందం జరిగినపుడు హైయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంటుతో నే ఒప్పందం జరిగింది. అప్పుడు ఉన్నత విద్యాశాఖకు మంత్రి గంటానే.