విజయవాడ 'తమ్ముళ్ల' స్టయిలే వేరు.. బాబుకు షాకిచ్చారు!
టీడీపీకి కేవలం ముగ్గురు మాత్రమే కార్పొరేటర్లు ఉన్నా.. వైసీపీ నాయకులను ఆకర్షించారు.
By: Tupaki Desk | 10 July 2024 5:24 PM GMTటీడీపీ నాయకుల తీరు రాష్ట్రంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొందరు దూకుడు గా ఉంటే.. మరికొందరు మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు. క్షేత్రస్థాయిలోనూ పార్టీని పుంజుకునేలా కొందరు వ్యవహరిస్తే.. మరికొం దరు మాత్రం.. పార్టీఏమైనా ఫర్లేదులే.. అధికారంలోకి వచ్చేశాం.. కదా! అన్నధోరణిలో వ్యవహరిస్తున్నారు. దీంతో తమ్ముళ్ల స్టయిల్ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంది. ఇటీవల చిత్తూరు నగరపాలక సంస్థలో టీడీపీ కూటమి ఆదిపత్యం పెరిగేలా అక్కడ తమ్ముళ్లు వ్యవహరించారు. టీడీపీకి కేవలం ముగ్గురు మాత్రమే కార్పొరేటర్లు ఉన్నా.. వైసీపీ నాయకులను ఆకర్షించారు.
దీంతో ఏకంగా 18 మంది వైసీపీ కార్పొరేటర్లు.. టీడీపీలోకి జంప్ చేశారు. దీంతో చిత్తూరు నగర పాలన అంతా కూడా ఇప్పుడు కూటమి చేతిలోకి వచ్చింది. ఇక, ఇప్పుడు విజయవాడ విషయానికి వస్తే.. ఇక్కడ తమ్ముళ్లు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపికి బలం ఉండి కూడా.. చేదు అనుభవం ఎదురైంది. స్టాండింగ్ కమిటీలకు సంబంధించి మొత్తంగా ఆరు స్థానాలు ఉన్నాయి. వాస్తవానికి టీడీపీకి 13 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అంటే.. మొత్తంగా కాకపోయినా.. ఒకటి రెండు స్థానాలనైనా వీరు దక్కించుకోవాల్సి ఉంది.
కానీ, అలా జరగలేదు. మొత్తం ఆరుకు ఆరు స్టాండింగ్ పదవులను కూడా వైసీపీనే దక్కించుకుంది. అది కూడా భారీ మెజారిటీ తో!!? ఆశ్చర్యంగా ఉన్నా నిజం. దీంతో అధికారంలో ఉండి కూడా విజయవాడ రాజకీయాలపై టీడీపీ పట్టు పెంచుకోలేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదేసమయంలో తమ్ముళ్ల వ్యవహారంపైనా పార్టీలో చర్చ సాగుతోంది. తెల్లారి లేస్తే.. మీడియా ముందు గళం విప్పే బుద్ధా వెంకన్న ఇంటికి కూత వేటు దూరంలో ఉన్న కార్పొరేషన్ కార్యాలయంలో పార్టీ ఇలా డీలా పడిపోతే..ఆ యన ఏం చేస్తున్నారనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దీనిపై పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.