Begin typing your search above and press return to search.

మోడీ స్కూల్ లో ఇద్దరు చంద్రులూ కలుసుకుంటారా...!?

మళ్లీ పొత్తు అంటున్నారు. 2019లో చంద్రబాబు నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా కూడా ఎటాక్ చేశారు.

By:  Tupaki Desk   |   17 Feb 2024 11:30 PM GMT
మోడీ స్కూల్ లో ఇద్దరు చంద్రులూ కలుసుకుంటారా...!?
X

రాజకీయాలు అంటే ఎన్నో చిత్రాలు ఉంటాయి. ఎవరు ఎవరికీ శత్రువులు కాదు, జస్ట్ ప్రత్యర్ధులు మాత్రమే. రాజకీయాల్లో అంతా పెదవుల మీదనే విమర్శలు వస్తాయి. హృదయం మాత్రం చాలా విశాలంగా ఉంటుంది. ఎవరిని ఎవరూ అక్కడ ఏమీ అనుకోరు. పైగా సమయం సందర్భం వచ్చినపుడు చాలా దగ్గరగా హృదయానికి హత్తుకుంటారు.

చంద్రబాబు విషయమే తీసుకుంటే ఆయన బీజేపీతో మూడు సార్లు పొత్తులు పెట్టుకున్నారు. మధ్యలో విడిపోయారు. మళ్లీ పొత్తు అంటున్నారు. 2019లో చంద్రబాబు నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా కూడా ఎటాక్ చేశారు. ఇపుడు మాత్రం ప్రత్యేక హోదా కోసమే విభేదించాను అంటున్నారు మళ్లీ పొత్తు అంటున్న చంద్రబాబు పోనీ ప్రత్యేక హోదాకు బీజేపీ ఒప్పుకుంది అని చెప్పగలరా అంటే లేదు.

అది టీడీపీకి అవసరం అయిన పొత్తు. అందుకే ఆయన మరోసారి తెలివిగా రాష్ట్ర ప్రయోజనాలు అన్న ముద్ర వేసి కమలంతో కరచాలనం చేయగలరు. ఇపుడు అదే జరగబోతోంది. ఏపీ రాజకీయాలలో ఇది కొత్త కాదు వింత అంతకంటే కాదు. బాబు మోడీ చేతులు కలిపే సమయం ఆసన్నమైంది అన్నది అందరికీ అర్ధం అవుతున్న విషయం.

ఇపుడు తెలంగాణాకు వెళ్తే అక్కడ అసలైన రాజకీయ చిత్రం కనిపించనుంది. అదేంటి అంటే నిన్నటిదాకా బీజేపీని విమర్శించిన బీఆర్ఎస్ అధికారం పోగానే దగ్గర అవుతోంది అన్నదే పెద్ద ఎత్తున సాగుతున్న ప్రచారం. దానికి కారణం ఉంది. అధికారంలో ఉన్న పార్టీలు బలంగా కనిపిస్తాయి. ఒక్కసారి ప్రతిపక్షంలోకి వచ్చాక మాత్రం వాటి బలహీనత బయటపడుతుంది. అదే టైం లో నీవు నేర్పిన విద్యయే అంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ ని ఆకట్టుకుంటోంది.

ఇక మిగిలిన పని బీజేపీ చేయకముందే ఆ పార్టీతో చేయి కలిపితే ఎలా ఉంటుంది అన్నది గులాబీ దళంలో చర్చ సాగుతోంది అని అంటున్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుంది అని అంటున్నారు. అయిదేళ్ల పాటు బీజేపీ అక్కడ ఉంటుంది. దాంతో బీజేపీ అండ ఉంటే తెలంగానా రాజకీయాల్లో స్ట్రాంగ్ గా అధికార కాంగ్రెస్ మీద దూకుడు చేయవచ్చు అన్నది బీఆర్ఎస్ లో పెరుగుతున్న ఆలోచనలు అని అంటున్నారు.

అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని అంటున్నారు.ఎ ఎందుకంటే బీఆర్ఎస్ కి పక్కాగా ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంక్ ఉంది. అలాగే కాంగ్రెస్ తో పాటుగా పోటీ పడే స్థాయిలో ఎస్సీ ఎస్టీ ఇతర వర్గాల మద్దతు ఉంది. టెంపరరీగా బీజేపీతో పొత్తుకు పోయినా ఆయా వర్గాలు మళ్లీ బీఅర్ఎస్ ని నమ్మే సీన్ ఉండదని, అలా కాంగ్రెస్ కి గుత్తమొత్తంగా ఆ ఓటు బ్యాంక్ ని అప్పగించిన వారమవుతామన్న బెంగ కూడా ఉందిట.

కానీ అనివార్యంగా ఇపుడు రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ సాయం కావాలంటే స్నెహం చేయక తప్పని స్థితి. మొత్తం మీద చూస్తే బీజేపీతో బీఆర్ఎస్ జట్టు కడుతుందా రెండు పార్టీలు కలసి వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ఎదుర్కొంటాయా అన్నది చూస్తే కనుక ఎన్నో ప్రశ్నలు కూడా ఉన్నాయి. అయితే ఒక్కటి మాత్రం నిజం అంటున్నారు. కాంగ్రెస్ అధికార పక్షం. విపక్షాలు రెండూ విడిగా పోటీ చేస్తే కనుక కాంగ్రెస్ కే మేలు చేకూరుతుంది అన్నది తర్కానికి అందే వాదన.

ఇప్పటికే సర్వేలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దాంతో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే రెండింటికీ మేలు అన్న చర్చ సాగుతోంది. ఇవన్నీ ఊహాగానాలుగా ప్రస్తుతం ఉన్నా వాస్తవాలు తొందరలోనే బయటకు వస్తాయని అంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు కనుక ఉంటే మాత్రం ఏపీలో చంద్రుడు, తెలంగాణా చంద్రుడు మోడీ స్కూల్ లో సహాధ్యాయులు గా కనిపిస్తారు అని అంటున్నారు.