Begin typing your search above and press return to search.

కొత్త డిక్రీ... 'వంట గదికి కిటీకీలు, ఓపెన్ ప్లేస్ లో బావులు వద్దు'!

ఈ సమయంలో తాజాగా తాలిబాన్ల ఆధీనంలో ఉన్న ఆఫ్ఘన్ లో ఓ షాకింగ్ కండిషన్ తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   30 Dec 2024 12:30 PM GMT
కొత్త డిక్రీ... వంట గదికి కిటీకీలు, ఓపెన్ ప్లేస్ లో బావులు వద్దు!
X

మతపరమైన ఆచారాల పేరు చెప్పి మహిళల ప్రాథమిక హక్కులను, స్వేచ్ఛను హరించే దేశాల జాబితా చాలా పెద్దదనే సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్ కోసం పరితపిస్తున్నట్లుగా ఊహించని కండిషన్స్ తెరపైకి తెస్తుంటాయి ఇరాన్, ఆఫ్ఘన్ ప్రభుత్వాలు అని అంటారు. ఈ సమయంలో తాజాగా తాలిబాన్ల ఆధీనంలో ఉన్న ఆఫ్ఘన్ లో ఓ షాకింగ్ కండిషన్ తెరపైకి వచ్చింది.

అవును... ఇప్పటికే మహిళలకు జిమ్ లు, పార్కుల్లో ప్రవేశంపై నిషేధం అమలుచేస్తూ.. మిడిల్, హైస్కూల్ విద్యకు బాలికలను దూరం చేయడం.. పలు రంగాల్లో వారికి ఉద్యోగాలనూ పరిమితం చేస్తూ తమదైన పాలన కొనసాగిస్తున్న దారుణమైన జాబితాలో తాజాగా మరో కొత్త కండిషన్ వచ్చి చేరింది. ఇందులో భాగంగా... వంట గదికి కిటికీలు ఉండకూడదని ఆదేశించింది.

వివరాల్లోకి వెళ్తే... ఆఫ్ఘనిస్తాన్ ను చేజిక్కించుకుని తమదైన పాలన అందిస్తూ, మతపరమైన ఆచారాల పేరు చెప్పి అక్కడి మహిళల హక్కులను కాలరాస్తున్న తాలిబన్లు తాజాగా మరో డిక్రీని తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా... కొత్తగా నిర్మించే ఇళ్లలో వంట గదికి కిటికీలు ఏర్పాటు చేయొద్దని ఆదేశించింది. లోపలున్న మహిళలు బయటకు కనిపించకుండా ఈ నిర్ణయం అని అంటున్నారు.

ఇదే సమయంలో... బహిరంగ ప్రదేశాల్లో ఉన్న బావుల వద్దకు నీటి కోసం వచ్చే మహిళలూ బయటవారికి కనిపిస్తె అభ్యంతరకర చర్యలకు దారితీసే వీలుందని చెబుతుంది. ఇలా తాలిబన్లు తాజాగా తీసుకొచ్చిన ఈ డిక్రీపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నివ్వెరపోయేలా చేస్తున్న ఈ ఆదేశాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయని అంటున్నారు.

వంట గదుల్లో ఉన్న మహిళతో పాటు ఇటి ఆవరణ, నీటికోసం బావుల వద్దకు వచ్చిన మహిళలు బయటివారికి కనిపిస్తే అభ్యంతరకర చర్యలకు దారితీసే వీలుందని.. అందువల్ల వారు కనిపించకుండా గోడలు కట్టాలని.. ఇప్పటికే ఇంట్లో స్త్రీలు బయటకు కనిపించేలా నిర్మాణాలు ఉంటే వాటిని మూసివేయాలని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఎక్స్ లో వెల్లడించారు.

కాగా... తాలిబన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఇప్పటికే ఐక్య రాజ్య సమితి ఖండించిన సంగతి తెలిసిందే. ఇలాంటి చర్యలు సరికాదని ఆందోళన వ్యక్తం చేసింది. మరి ఈ తాజా నిబంధనలపై ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి!