జగన్ తో ఫోటో కోసం ఇంటి ముందు బైఠాయింపు? ఆ తర్వాత మరో ట్విస్టు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ఎదుట ఒక మహిళ వ్యవహరించిన తీరు షాకింగ్ గా మారింది.
By: Tupaki Desk | 8 Feb 2025 5:00 AM GMTఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ఎదుట ఒక మహిళ వ్యవహరించిన తీరు షాకింగ్ గా మారింది. అద్దంకికి చెందిన ఆమె.. జగన్మోహన్ రెడ్డితో ఫోటో కోసం పెద్ద ఎత్తున ప్రయత్నించింది. ఒక దశలో ఫోటో తీయిస్తే తప్పించి.. తాను అక్కడి నుంచి కదలనని మొండిపట్టును ప్రదర్శించింది. బాపట్ల జిల్లాకు చెంది అద్దంకికి చెందిన సిద్ధారపు అంజమ రెడ్డి హడావుడితో.. ఆమె వివరాల్ని జగన్ వ్యక్తిగత సిబ్బందికి అందజేశారు.
వైఎస్ జగన్ తో ఫోటో దిగే వరకు తిరిగి వెళ్లనని మొండిపట్టును ప్రదర్శిస్తున్న విషయాన్ని చెప్పటంతో.. వైసీపీ గ్రీవెన్ సెల్ రాష్ట్ అధ్యక్షుడు నాగ నారాయణమూర్తి ఆమెను తీసుకొని తాడేపల్లి లోని జగన్ నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను జగన్ తో ఫోటో తీయించారు. ఆ తర్వాత బయటకు వచ్చిన ఆమె కొత్త ట్విస్టుకు తెర తీసింది.
తనకు అప్పులు ఉన్నాయని. అందుకు జగన్ సాయం చేయాలని కోరుతూ ఇంటి ముందు ఉండిపోయింది. ఎంత నచ్చజెప్పినా ఒప్పుకోకపోవటంతో ఆమెకు సంబంధించిన సమాచారాన్ని తాడేపల్లి పోలీసులకు అందించారు. దీంతో సీఐ కల్యాణ్ రాజు అక్కడికి చేరుకొని సదరు మహిళను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఆమె వివరాల్ని సేకరించి.. ఆమెకు కొద్దిపాటి కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు. అభిమానం పేరు చెప్పి ఫోటో కోసం ప్రయత్నం చేయటం.. ఆ తర్వాత తనకున్న అప్పుల్ని తీర్చాలన్న సదరు మహిళ తీరు స్థానికంగా సంచలనంగా మారింది.