Begin typing your search above and press return to search.

ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడని..

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తనకు దక్కనిది ఇంకొకరికి దక్కడానికి వీలు లేదని అనుకున్న యువతి.. తన ప్రియుడిపై దారుణంగా అటాక్‌ చేసింది

By:  Tupaki Desk   |   24 Dec 2024 3:30 PM GMT
ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడని..
X

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తనకు దక్కనిది ఇంకొకరికి దక్కడానికి వీలు లేదని అనుకున్న యువతి.. తన ప్రియుడిపై దారుణంగా అటాక్‌ చేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న జంట మధ్య ఇలా ఊహించని పరిణామం జరిగింది. ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకున్న యువతి దారుణానికి ఒడిగట్టింది. ఏకంగా అతనిపై రివేంజ్ తీసేందుకు ప్లాన్ చేసి తీసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ జంట ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటోంది. అతను మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. దీంతో ఆ యువతి ఆగ్రహంతో ఊగిపోయింది. కళ్లెదుటే మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి తట్టుకోలేకపోయింది. దీంతో ప్రియుడిని కలిసేందుకు నిర్ణయించుకుంది. అందులో భాగంగానే తన ప్రియుడికి సమాచారం ఇచ్చింది. యువతి కోరిక మేరకు ఆదివారం వారిద్దరూ కలిశారు. ప్రియుడి కారులో కూర్చొని మాట్లాడుకుంటున్నారు.

అలా.. మాట్లాడుతుండగానే ఒక్కసారిగా ఆ యువతి ఊగిపోయింది. గంటల తరబడిగా మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా కోపంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రియుడిపై దాడికి పాల్పడింది. అత్యంత దారుణంగా అతడి జననాంగాలను కోసేసింది. అనంతరం అదే కత్తితో తన మణికట్టును కోసేసుకుంది. ఘటన గురించి తెలుసుకుని ఇద్దరినీ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో ప్రేమ వ్యవహారమే కారణమని తేలింది. ఇద్దరూ కుల్హేడిలోని చార్తావాల్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. తన ప్రియుడు తనకు చెప్పకుండా మరో పెళ్లికి సిద్ధమయ్యాడని ప్రియురాలు ఆరోపించింది. ప్రస్తుతం ప్రియుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

అయితే.. ఇప్పుడు ఈ వీడియో ‘ఎక్స్’ వేదికగా వైరల్ అయింది. పోలీసులు ఆ యువతిని వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న విజువల్స్ వీడియోలో కనిపించాయి. ‘ఎనిమిదేళ్ల ప్రేమ.. చివరికి ఇలా ముగిసింది. ప్రియుడు మరో పెళ్లికి సిద్ధం అయ్యాడని తెలియడంతో ప్రియురాలు కత్తి తీసి లవర్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసింది’ అని క్యా్ప్షన్ పెట్టారు. నెటిజన్లు సైతం వివిధ రకాలుగా కామెంట్స్ చేశారు. ‘అతను నాకు దక్కకపోతే ఇంకెవరికీ దక్క వద్దనే అనుకుందేమో’ అంటూ కొందరు కామెంట్స్ పెట్టారు. ఆమె చేసిన నేరానికి తగిన శిక్ష పడదని.. కొద్ది రోజుల్లోనే బయటకు వచ్చేస్తుందని.. చట్టం ఆమెను కాపాడుతుందని పేర్కొన్నారు.