కోల్ కతా రే*ప్ లో కొత్త మలుపు! - యువ వైద్యురాలి డెడ్ బాడీ మీద మహిళ డీఎన్ఏ?
ఇదంతా ఒక ఎత్తు అయితే బాధితురాలు ‘అభయ’ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.
By: Tupaki Desk | 22 Jan 2025 7:54 AM GMTదేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కోల్ కతాలోని ఆర్ జీకర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికోపై జరిగిన హత్యాచారం ఉదంతంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్ ను చనిపోయే వరకు జైల్లోనే ఉండేలా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వటం.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం పెదవి విరిచారు. తాజాగా ఈ తీర్పుపై హైకోర్టు అప్పీలును కోరారు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి కోర్టు తీర్పుపై విమర్శలు భారీగా వస్తున్నాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే బాధితురాలు ‘అభయ’ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. దీంతో.. ఈ వ్యవహారంపై కొత్త చర్చ మొదలైంది. విచారణకు సంబంధించిన కొన్ని నివేదికలు వెలుగు చూడటంతో ఈ హత్యాచార ఉదంతంలో మరిన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ సమర్పించిన రిపోర్టును చూసినప్పుడు అత్యాచారానికి గురైన బాధితురాలి డెడ్ బాడీ మీద సంజయ్ రాయ్ డీఎన్ఏ 100 శాతం మేర ఉన్నట్లుగా గుర్తించారు.
అదే సమయంలో కొద్ది శాతం మరో మహిళ డీఎన్ఏ కూడా ఉన్నట్లు తేలింది. ఇది సంజయ రాయ్ డీఎన్ ఏలో కలిసిందా? లేదంటే ఇంకేమైనా జరిగిందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిప్పుడు కొత్త చర్చకు తెరతీసింది. మరోవైపు కోర్టు తీర్పుపై పెదవి విరిచిన మమతా సర్కారు.. దీనిపై అప్పీలుకు హైకోర్టును ఆశ్రయించగా.. అందుకు ఓకే చెప్పింది. ఈ కేసు విచారణను మరింత లోతుగా సాగాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తుందని చెప్పాలి.