సైనైడ్ ఇచ్చి.. 14 మందిని చంపి.. చివరకు ఆ మహిళ పరిస్థితి..
గ్యాంబ్లింగ్‌కు అలవాటు పడి.. తరచూ ఫ్రెండ్స్ వద్ద అప్పులు చేసి.. వాటిని తిరిగి ఇవ్వాలని అడిగినందుకు చంపి అడ్డుతొలగించింది ఓ లేడీ.
By: Tupaki Desk | 21 Nov 2024 1:30 PM GMTగ్యాంబ్లింగ్‌కు అలవాటు పడి.. తరచూ ఫ్రెండ్స్ వద్ద అప్పులు చేసి.. వాటిని తిరిగి ఇవ్వాలని అడిగినందుకు చంపి అడ్డుతొలగించింది ఓ లేడీ. అలా ఏకంగా 14 మంది స్నేహితులను ఆమె హతమార్చింది. దీనిని తీవ్రంగా పరిగణించిన థాయ్‌లాండ్ కోర్టు ఆమెకు మరణ శిక్ష విధించింది.
రాజ్య చరిత్రలో అత్యంత దారుణమైన సీరియల్ కిల్లర్‌లలో ఒకరిగా ఈ మహిళ నిలిచింది. ఒక థాయ్ మహిళ తన స్నేహితులకు సైనైడ్‌తో విషమిచ్చింది. ఆమె 14 మందిని మర్డర్ చేసింది. సరరత్ రంగసివుతాపర్న్ 36 ఏళ్ల యువతి ఆన్‌లైన్ జూదానికి బానిసైంది. స్నేహితుల వద్ద తరచూ అప్పులు చేస్తుండేది. ఎవరైనా తిరిగి డబ్బులు అడిగితే ఎవరికీ అనుమానం రాకుండా వారికి ఆహారం, డ్రింక్స్‌లో సైనైడ్ కలిపి ఇచ్చేది. దాంతో వారిని హత్య చేస్తుండేది.
అనంతరం మృతుల ఇళ్లలో ఉండే నగలు, బంగారం, విలువైన వస్తువులను దోచుకుని వెళ్లేది. కొన్నేళ్లపాటు ఆమె ఇలాంటి దుశ్చర్యలకే పాల్పడుతూ ఉండేది. అయితే.. గతేడాది సారరత్ తన ఫ్రెండ్ సిరిపర్న్ ఖన్వాంగ్ ఆకస్మికంగా చనిపోయింది. దీంతో ఈ సీరియల్ మర్డర్లు వెలుగులోకి వచ్చాయి.
గత ఏప్రిల్‌లో పశ్చిమ బ్యాంకాక్‌లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమం కోసం ఖన్వాంగ్, సారరత్ కలిసి వెళ్లారు. అక్కడ ఆహారం తిన్న వెంటనే ఆమె స్నేహితురాలు వెంటనే కుప్పకూలి చనిపోయింది. ఈ మరణంపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఖన్వాంగ్‌కు సంబంధించిన వస్తువులు కూడా కనిపించకుండా పోయాయని గుర్తించారు. అయితే.. పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో సైనైడ్ ఆనవాళ్లు కనిపించాయి. దీంతో 2015లోనూ ఇదే తరహాలో జరిగిన మరికొన్ని కేసులను వెలికితీశారు. వాటిలోనూ సారరత్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా.. విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. దీంతో ఖన్వాంగ్ తల్లి తీవ్ర ఉద్వేగానికి గురైంది. ఇప్పుడు తన బిడ్డకు న్యాయం దక్కిందని కోర్టు బయట సంతోషం వ్యక్తం చేసింది.