అదనపు కట్నం కోసం ఆఫ్రికన్ జాతి పక్షితో టార్చర్... భార్య ఫిర్యాదు!
ఈ సమయంలో భార్యను ఆఫ్రికన్ జాతి పక్షితో పొడిపించి పొడిపించి వేధిస్తున్నాడని అంటున్నారు.
By: Tupaki Desk | 28 Jan 2025 11:30 PM GMTభార్యను అదనపు కట్నం కోసం విచిత్రంగా వేధించిన ఓ భర్త చిత్రహింసల వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది. ఐటీ కంపెనీలో తనతో పాటు ఉద్యోగం చేస్తున్న భార్యను అదనపు కట్నం కోసం వేధించిన ఓ భర్త కథ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో భార్యను ఆఫ్రికన్ జాతి పక్షితో పొడిపించి పొడిపించి వేధిస్తున్నాడని అంటున్నారు.
అవును... తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను చిత్రహింసలకు గురిచేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సమయంలో తనతో పాటు ఐటీ కంపెనీలో పనిచేస్తున్న తన భార్యను అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. ఇతడి వేధింపులకు ఇతడి తల్లితండ్రులు కూడా మద్దతుగా నిలవడంతో ఆమె ఒంటరైపోయింది.
దీంతో.. తన భర్త, అత్తమామలు కలిసి తనకు రోజూ నరకం చూపిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో... పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈసమయంలో... బాధితురాలి భర్తతో పాటు అతడి తల్లితండ్రులు, వారికి సహకరించిన బంధువులపైనా కేసు నమోదు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దామ్..!
వివరాల్లోకివెళ్తే... పుదుచ్చేరికి చెందిన యువతి ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. అదే సంస్థలో పనిచేస్తున్న వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో 2021లో వారిరువురూ వివాహం చేసుకున్నారు. అక్కడివరకూ బాగానే సాగింది కానీ.. కొన్ని రోజుల తర్వాత భర్తలో మార్పు వచ్చేసింది.
ఈ సమయంలో... కొన్ని వారాల తర్వాత తనకు కట్నంగా ఇచ్చిన నగలను అత్త తీసుకోగా.. మరో 50 సవర్ల బంగారు ఆభరణాలు తీసుకురావాలంటూ భర్త ఇబ్బందులు పెట్టేవాడు. ఈ క్రమంలో.. రోజు రోజుకీ భర్త వేధింపులు ఎక్కువవ్వసాగాయి. ఈ సమయంలో.. భార్య పుట్టింటి ఆస్తిని కూడా తన పేరుమీదే రాయాలంటూ ఇబ్బందులు పెట్టేవాడని అంటున్నారు.
అందుకు ఆమె ఒప్పుకోలేదంట. దీంతో తాను పెంచుకుంటున్న ఆఫ్రికన్ జాతి పక్షితో పొడిపిస్తూ చిత్ర హింసలకు గురిచేసేవాడంట భర్త. ఈ సమయంలో తన అత్తమామలకు చెప్పుకున్నా ఫలితం లేదు సరికదా.. వారు కూడా తన భర్తకు మద్దతివ్వడం మొదలుపెట్టారట. దీంతో.. ఇక చేసేది లేక ఆమె వారి నుంచి తప్పించుకుని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది!
దీంతో... పోలీసులు రంగంలోకి దిగి భార్త, అత్తమామలపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో.. వారికి సహకరించినట్లు ఆరోపిస్తున్న బంధువులపైనా కేసులు నమోదు చేశారని తెలుస్తోంది.