Begin typing your search above and press return to search.

కారులో డ్రైవింగ్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్... వీడియో వైరల్!

ఐటీ ఉద్యోగుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్లేస్ తోనూ సమయంతోనూ సంబంధం లేకుండా ల్యాప్ టాప్ లో వర్క్ చేస్తూనే కనిపిస్తుంటారు.

By:  Tupaki Desk   |   13 Feb 2025 10:14 AM GMT
కారులో డ్రైవింగ్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్... వీడియో వైరల్!
X

ఐటీ ఉద్యోగుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్లేస్ తోనూ సమయంతోనూ సంబంధం లేకుండా ల్యాప్ టాప్ లో వర్క్ చేస్తూనే కనిపిస్తుంటారు. చాలా మంది నిత్యం బిజీగా ఉంటుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ మహిళ ఏకంగా కారు డ్రైవ్ చేస్తూ ల్యాప్ టాప్ లో వర్క్ చేయడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అవును... ఎంత బిజీ అయితే మాత్రం, ఎంత వర్క్ ఉంటే మాత్రం కారు డ్రైవ్ చేస్తూ మరీ ల్యాప్ టాప్ లో వర్క్ చేసింది ఓ మహిళ. ఈ విషయం తీవ్ర వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై ట్రాఫిక్ పోలీసులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.. చర్యలకు ఉపక్రమించారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని ఆర్టీ నగర్ ప్రాంతంలో ఓ మహిళ కారు డ్రైవ్ చేస్తూనే ల్యాప్ టాప్ లో వర్క్ చేస్తుంది. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అది కాస్తా ఫుల్ వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసుల దృష్టికీ చేరింది. దీంతో.. యాక్షన్ స్టార్ట్ చేశారు పోలీసులు.

ఇందులో భాగంగా... ఆమెను ట్రాక్ చేసి, వెయ్యి రూపాయల జరిమానా విధించారు. ఇదే సమయంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆ మహిళ వీడియోతో పాటు ఆమెకు ఫైన్ వేసినప్పుడు తీసుకున్న ఫోటోను బెంగళూరు ట్రాఫిక్ డీసీపీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచి చేయాలి.. కారు డ్రైవ్ చేస్తూ కాదు అని రాసుకొచ్చారు.

ఆ పోస్ట్ పై నెటిజన్లు గట్టిగానే స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులను అభినందిస్తుంటే.. మరి కొంతమంది ఆ మహిళపై మండిపడుతున్నారు. మరికొంతమంది బెంగళూరులో దిగజారుతున్న ట్రాఫిక్ పరిస్థితికి ఇది ప్రత్యక్ష ఫలితమని అంటే.. కార్పొరేట్ రంగాల 90 గంటల పని సంస్కృతి ఫలితం అని మరొకరు అభిప్రాయపడ్డారు.