ఆరేళ్లలో 7 పెళ్లిళ్లు.. ఆమెపై కర్ణాటక హైకోర్టు సీరియస్
ఆమెకు అక్షరాల 32 ఏళ్లు. ఆరేళ్ల వ్యవధిలో 7 పెళ్లిళ్లు చేసుకుంది. తాజాగా ఏడో పెళ్లిని సైతం పెటాకులు చేసుకునేందుకు సిద్ధమైంది
By: Tupaki Desk | 30 July 2024 4:58 AM GMTఆమెకు అక్షరాల 32 ఏళ్లు. ఆరేళ్ల వ్యవధిలో 7 పెళ్లిళ్లు చేసుకుంది. తాజాగా ఏడో పెళ్లిని సైతం పెటాకులు చేసుకునేందుకు సిద్ధమైంది. విడాకులు ఇప్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పటివరకు ఆమె దెబ్బకు హడలిపోయిన మాజీ భర్తలకు భిన్నంగా ఏడో భర్త మాత్రం కాస్త భిన్నంగా వ్యవహరించారు. ఆమె గత చరిత్రను బయటకు తీసి.. హైకోర్టు ఎదుట పెట్టారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.
కర్ణాటకకు చెందిన ఒక మహిళ శ్రీమంతుల్ని పెళ్లి చేసుకోవటం.. పెళ్లైన ఆర్నెల్లకే విడాకులు ఇప్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించటం ఒక అలవాటు. ఈ క్రమంలో సదరు భర్త నుంచి సెటిల్ మెంట్ అమౌంట్ తీసుకొని చెక్కేస్తుంటారు. ఆరేళ్లలో ఏడు పెళ్లిళ్లు చేసుకున్న ఆమె.. ఆరుగురు భర్తలకు విడాకులు ఇచ్చింది. పెళ్లైన ఆర్నెల్లకే తనను భర్త.. అత్తింటి కుటుంబం వారు వేధిస్తున్నారంటూ గ్రహహింస కేసు పెట్టేది.
ఓవైపు కేసులు.. మరోవైపు ఆమె తీరును భరించలేని భర్తలు ఆమెతో రాజీ చేసుకొని.. పెద్ద ఎత్తున సెటిల్ మెంట్ కు ఓకే చెప్పేసి విడాకులు తీసుకునే వారు. ఆ వెంటనే మరొకరిని ఆమె పెళ్లాడేది. మళ్లీ.. అక్కడా అదే కథ. ఏడో భర్త విషయంలో మాత్రం తేడాగా జరిగింది. పెళ్లైన ఆర్నెల్లకే విడాకుల కోసం అప్లై చేయగా.. గుట్టు చప్పుడు కాకుండా ఆమె గతంలో చేసుకున్న ఆరు పెళ్లిళ్లు.. విడాకుల సమాచారాన్ని కోర్టు ముందుకు తీసుకొచ్చారు. ఏడో భర్త తెర మీదకు తెచ్చిన ఆమె గతాన్ని చూసిన హైకోర్టు న్యాయమూర్తి సీరియస్ అయ్యారు.
కేవలం డబ్బు కోసమే ఇలా పెళ్లిళ్లు చేసుకోవటం.. విడాకులకు అప్లై చేయటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. మహిళల రక్ష కోసం తీసుకొచ్చిన చట్టాన్నిఉపయోగించుకొని దుర్వినియోగం చేస్తున్న మహిళ తీరును హైకోర్టు న్యాయమూర్తి తీవ్రంగా తప్పు పట్టారు. విడాకులకు అప్లై చేసుకున్న మహిళ తీరును ప్రశ్నించిన ఆయన.. ఏ భర్తతోనూ ఎక్కువ రోజులు కలిసి ఉండకపోవటం ఏమిటి? అందులో మీ తప్పే కనిపిస్తోందని సీరియస్ అయ్యారు. ఈ కేసు తుది విచారణను ఆగస్టు 21కు వాయిదా వేశారు. ఈమె ఉదంతం సంచలనంగా మారింది.