Begin typing your search above and press return to search.

పురుషులకంటే మహిళలే నయం!

చాలా విషయాల్లో పురుషులకంటే మహిళలే నయం. సంసారంలో అయినా పనిలో అయినా వారి ప్రాతినిధ్యమే పెరుగుతోంది.

By:  Tupaki Desk   |   13 Dec 2023 11:30 PM GMT
పురుషులకంటే మహిళలే నయం!
X

చాలా విషయాల్లో పురుషులకంటే మహిళలే నయం. సంసారంలో అయినా పనిలో అయినా వారి ప్రాతినిధ్యమే పెరుగుతోంది. పలు కంపెనీలు, పరిశ్రమలు, టెక్నాలజీ వంటి రంగాల్లో వారే ముందుంటున్నారు. ఉద్యోగంలో కానీ పనిలో కానీ వారి పనికే ప్రాధాన్యం ఉంటోంది. పురుషుల కంటే వారి పనితనమే ప్రామాణికంగా మారుతోంది. ఈనేపథ్యంలో అప్నా విడుదల చేసిన ఓ నివేదికలో ఆసక్తికర విషయాలు వెలుగు చూడటం గమనార్హం.

అప్నా జాబ్ మార్కెట్లో మహిళలే అత్యధికంగా ఉద్యోగం చేసేందుకు దరఖాస్తులు సమర్పించినట్లు తెలుస్తోంది. ఉద్యోగాలు చేయడంలో కూడా వారే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. పురుషుల వేతనాల్లో 17 శాతం మాత్రమే పెరుగుల నమోదు చేశారు. కానీ మహిళలు ఇంకా అధిక సంఖ్యలో పెరుగుదల నమోదు చేయడం విశేషం. అందుకే మగవారి కంటే ఆడవారే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారని చెబుతున్నారు.

దేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 37 శాతం పెరిగింది. ఇది 2022లో 32.8 శాతం కాగా 2021లో 32.5 శాతంగానే ఉండేది. ఐటీ, ఆర్థిక సేవలు, సప్లై చైన్, లాజిస్టిక్ విభాగాల్లో మహిళలే పురోగమనం సాధిస్తున్నారు. మరో పదేళ్లలో మహిళల భాగస్వామ్యం రెట్టింపు కానున్నట్లు తెలుస్తోంది. వర్క్ ఫోర్స్ లో వారి భాగస్వామ్యం పెరుగుతోంది.

పురుషులకంటే మహిళలకే కమిట్ మెంట్ ఎక్కువ ఉంటుంది. అందుకే వారి పనితీరుకు మొగ్గు చూపుతుంటారు. ఎలాంటి సంస్థలైనా వారిని పెట్టుకుని మంచి లాభాలు సాధిస్తుంటారు. పురుషులు పనితీరు సరిగా ఉండదు. ఒక రోజు చేస్తే రెండో రోజు తప్పించుకుంటారు. కానీ మహిళలు అలా కాదు. వారు విధికి ప్రాధాన్యం ఇస్తుంటారు. నెల రోజులు సెలవులు లేకుండా పనిచేయడానికి ఇష్టపడుతుంటారు.

మహిళా శ్రామిక శక్తిని పలు సంస్థలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. వారితో సంస్థలు బలోపేతం అవుతున్నాయి. అదే పురుషులతో మనుగడ సాగించడం కష్టంగా ఉంటుంది. అందుకే మహిళలను తీసుకుంటే వారి సామర్థ్యంతో మంచి ఉన్నతి సాధించుకోవచ్చు. దీంతో వారిని నియమించుకుని ఆర్థికంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుండటం విశేషం.