Begin typing your search above and press return to search.

మాటలు రాని కొడుకును మొసలి పాలు చేసిన తల్లి !

పుట్టుకతోనే మూగవాడైన ఆ బాలుడిని కన్న తల్లి సావిత్రి మొసళ్లు ఉన్న కాలువలో విసిరేసింది

By:  Tupaki Desk   |   6 May 2024 10:22 AM IST
మాటలు రాని కొడుకును మొసలి పాలు చేసిన తల్లి !
X

ఇది సభ్యసమాజం తలవంచుకునే సంఘటన. నవమాసాలు కడుపున మోసి జన్మనిచ్చిన కన్న తల్లే ఆ కొడుకుకు మాటలు రావడం లేదని మొసలి పాలు చేసింది.

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా, దండెలి తాలూకాలో తల్లిదండ్రుల మధ్య జరిగిన ఘర్షణ ఆరేళ్ల బాలుడి ప్రాణాలను తీసింది. పుట్టుకతోనే మూగవాడైన ఆ బాలుడిని కన్న తల్లి సావిత్రి మొసళ్లు ఉన్న కాలువలో విసిరేసింది.

మూగవాడిని ఎందుకు కన్నావు?’ అంటూ తరచూ భార్యను భర్త రవి కుమార్‌ వేధిస్తూ ఉండేవాడు. ఎప్పటి మాదిరిగానే శనివారం ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమె తన కొడుకును తీసుకెళ్లి సమీపంలో ఉన్న కాలువలోకి విసిరేసింది. పోలీసులు ఆదివారం బాలుడి మృతదేహాన్ని గుర్తించగా మృతదేహంపై తీవ్రమైన గాయాలు, మొసలి కొరికిన గుర్తులు కనిపించాయి. దానితో పాటు ఆ బాలుడి ఓ చెయ్యి కనిపించలేదు. ఆ బాలుడి మరణగాధ ఆ ప్రాంతంలోని ప్రజల మనసుల్లో విషాధం నింపింది.