Begin typing your search above and press return to search.

బాయ్ ఫ్రెండ్ నెంబర్ బ్లాక్ చేశాడని పీఎస్ లో ఫిర్యాదు... వాట్ నెక్స్ట్?

ఈ రోజు ప్రేమికుల దినోత్సవం కావడంతో.. జంటలన్నీ సంబరాలు చేసుకుంటుండగా, సింగిల్స్ అంతా జంటలయ్యే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   14 Feb 2025 5:52 AM GMT
బాయ్  ఫ్రెండ్  నెంబర్  బ్లాక్  చేశాడని పీఎస్  లో ఫిర్యాదు... వాట్  నెక్స్ట్?
X

ఈ రోజు ప్రేమికుల దినోత్సవం కావడంతో.. జంటలన్నీ సంబరాలు చేసుకుంటుండగా, సింగిల్స్ అంతా జంటలయ్యే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా బాయ్ ఫ్రెండ్ తన నెంబర్ బ్లాక్ చేశాడని.. కాస్త సాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసింది ఓ యువతి. ఈ విషయం ఇంట్రస్టింగ్ గా మారింది.

అవును... సాధారణంగా సిటీలో షీ టీమ్స్ కి, ఊర్లలో పోలీస్ స్టేషన్ కి అమ్మాయిలు ఎవరైనా అబ్బాయిల విషయంలో కాల్ చేస్తే అందుకు ప్రధానంగా ఈవ్ టీజింగ్ కానీ, నమ్మించి మోసం చేశాడని కానీ కారణాలుగా ఉంటాయని చెబుతారు. అయితే.. రొటీన్ కి భిన్నంగా తాజాగా బాయ్ ఫ్రెండ్ తన నెంబర్ ను బ్లాక్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ యువతి.

వివరాళ్లోకి వెళ్తే... సార్.. నా బాయ్ ఫ్రెండ్ నా ఫోన్ నెంబర్ ను బ్లాక్ లో పెట్టాడు.. మీరు కాస్త అతడికి ఫోన్ చేసి, మాట్లాడండి సర్.. ఎలాగైనా నా నెంబర్ అన్ బ్లాక్ చేయించండి సర్.. అని అనంతపురం జిల్లా గుత్తిలో ఓ యువతి 100కు డయల్ చేసింది. దీంతో... గుత్తి పీఎస్ పోలీసులు ఆమెను సంప్రదించారు.

ఇందులో భాగంగా... గుత్తి పోలీస్ స్టేషన్ నుంచి బ్లూ కోల్ట్ కానిస్టేభూల్ సుధాకర్ ఆ యువతిని సంప్రదించారు. అయితే.. ఆ యువతి మాత్రం, పోలీసులు తన ఇంటివద్దకు రావొద్దని చెప్పింది. తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడి నా నంబర్ అన్ బ్లాక్ చేయిస్తే చాలని రిక్వస్ట్ చేసింది. దీంతో... అతడి నెంబర్ తీసుకున్న కానిస్టేబుల్.. డైల్ చేసి చూసినా కాల్ రిసీవ్ చేయలేదని అంటున్నారు.

దీంతో.. ఆ విషయం సదరు యువతికి చెప్పిన పోలీస్... దీనిపై నేరుగా స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడం మంచిదని సూచించినట్లు చెబుతున్నారు. దీంతో... ఈ విషయం ఆసక్తిగా మారింది. డయల్ 100 ను ఇలా కూడా వాడుతున్నారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.