మహిళల పెట్టుబడుల్లో ఫ్యూచర్ ప్లాన్స్ పై ఇంట్రస్టింగ్ డేటా!
మహిళలు వారి పెట్టుబడుల్లో మూడోవంతు పిల్లల కోసం, రిటైర్మెంట్ కోసం కేటాయిస్తున్నారనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 8 March 2025 5:00 PM ISTమహిళలు వారి పెట్టుబడుల్లో మూడోవంతు పిల్లల కోసం, రిటైర్మెంట్ కోసం కేటాయిస్తున్నారనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా... బీమా కవరేజ్, పెట్టుబడి సంబంధిత పాలసీలను ఎంచుకునే విషయంలో మహిళల సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు. ఈ సందర్భంగా బీమా మార్కెట్ ప్లేస్ అయిన పాలసీ బజార్ ఆసక్తికర డేటా తెరపైకి తెచ్చింది.
అవును... ఫైనాన్షియల్ ఫ్యూచర్ విషయంలో మహిళల ఆలోచనా విధానం మారుతుందని తెలుస్తొంది. ఈ సందర్భంగా తాజగా తెరపైకి వచ్చిన పాలసీబజార్ డేటా ప్రకారం... టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న మహిళల సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18 శాతం పెరిగింది. ఇందులో వేతన జీవులు 49% ఉండగా.. హోం మేకర్స్ 39% అని పేర్కొంది.
ఇదే సమయంలో 44 శాతం మంది మహిళలు ప్రస్తుతం రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ కవర్ ఎంచుకుంటున్నారని డేటా వెల్లడించింది. ఈ సందర్భంగా స్పందించిన పాలసీబజార్ ఇన్వెస్ట్ మెంట్ ప్రొడక్ట్ హెడ్ సమీప్ సింగ్... మహిళల పెట్టుబడుల్లోని వ్యూహాత్మక కేటాయింపు వారి స్వంత ఆర్థిక స్వాతంత్రయానికి బలమైన పునాది వేయడమే కాకుండా.. వారి ప్రియమైనవారి భవిష్యత్తును కాపాడుతుందని అన్నారు.
ఇదే సమయంలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. మణిపాల్ సిగ్మా ఓ నివేదికను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం పాలసీలు కొనుగోలు చేసిన వారి సంఖ్య 2023లో 28,741 నుంచి 2024లో 3,53,943కి పెరిగిందని తెలిపింది. అదేవిధంగా... 2024లో మొత్తం మహిళా పాలసీదారులలో 35-49 సంవత్సరాల వయసు గల మహిళలు 27.29% ఉన్నారని పేర్కొంది.
వయస్సుల వారీగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నవారు!:
18-30 సంవత్సరాలు: 41%
31-40 సంవత్సరాలు:48%
41-50 సంవత్సరాలు:10%
ఇక వీరిలో 90% మంది మహిళలు మంత్లీ ప్రీమియం చెల్లింపులను ఇష్టపడతారని.. ప్రధానంగా మెట్రో నగరల్లోని మహిళలు టర్మ్ ఇన్సూరెన్స్ స్వీకరణలో ముందంజలో ఉన్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఢిల్లీ, బెంగళూరు, ముంబై, పూణే, చెన్నై, హైదరాబాద్ సిటీలు అగ్రస్థానంలో ఉన్నాయని పాలసీబజార్ తెలిపింది.