Begin typing your search above and press return to search.

5 స్టార్ రేటింగ్ పేరుతో రూ.4.81 లక్షలు పోగొట్టుకున్న వివాహిత

విజయవాడలోని నున్న పరిధిలో ఈ సైబర్ మోసం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   31 Aug 2024 5:34 AM GMT
5 స్టార్ రేటింగ్ పేరుతో రూ.4.81 లక్షలు పోగొట్టుకున్న వివాహిత
X

ఆశకు హద్దు ఉండాలి. ఊరికే డబ్బులు రావన్న ప్రాధమిక సూత్రాన్ని మాయమాటలు చెప్పే వారు తగిలినప్పుడు అప్రయత్నంగా మర్చిపోతారు. అంతకంతక వచ్చి పడుతున్న డబ్బుల ట్రాప్ లో పడిన వివాహిత ఒకరు ఏకంగా రూ.4.81 లక్షలు పోగొట్టుకున్న తర్వాత కానీ అమె తాను మోసపోయిన విషయం అర్థంకాలేదు. విజయవాడలోని నున్న పరిధిలో ఈ సైబర్ మోసం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

ఒక ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్ గా వ్యవహరిస్తున్ వివాహిత ఒకరికి ఈ నెల 17న నిమిష అనే గుర్తు తెలియని టెలిగ్రామ్ అకౌంటర్ ద్వారా పార్ట్ టైం జాబ్ పేరుతో ఆఫర్ వచ్చింది. ఆమె మాటల్ని నమ్మిన ఈ వివాహిత రిజిస్టర్ చేసుకున్నారు. ఆ వెంటనే రూ.821 కమిషన్ కూడా వచ్చినట్లుగామెసేజ్ వచ్చింది.క్ర ఆ తర్వాత రోజు రూ.10 వేలు చెల్లించి రేటింగ్ టాస్క్ పూర్తి చేయగానే రూ.18,098 కమిషన్ కింద వచ్చింది.

తనకు వచ్చిన ఆదాయం మొత్తం.. ఆమె యాప్ ఖాతాలో కనిపించటంతో.. ఆ మొత్తాన్ని మరింత పెంచుకోవాలన్న ఆశ కలిగేలా చేశారు. ఇలా.. మాయమాటలు చెప్పి ఆమె నుంచి మొత్తం రూ.4.81 లక్షలు పెట్టుబడులు పెట్టించారు. చివరకు ఆమె ఖాతాలో కనిపిస్తున్న డబ్బులు తీసుకునే ప్రయత్నం చేయగా.. కుదర్లేదు. దీంతో ఆమె తాను మోసపోయిన విషయాన్ని గుర్తించి సైబర్ క్రైం పోలీసులకు కంప్లైంట్ చేశారు.

దీనిపై పోలీసులు స్పందించి.. ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్లిన డబ్బుల లెక్కల్ని చూస్తే.. మొత్తం ఆరు ఖాతాలకు, రెండు యూపీఐ అకౌంట్లకు వెళ్లినట్లుగా గుర్తించారు. ఇందులో ఒక ఖాతా అసోంలోఉంటే.. మరో రెండు పశ్చిమ బెంగాల్ లో ఉన్నాయి. ఇంకొకటి కేరళ.. మరో రెండు ఛత్తీస్ గఢ్.. రాజస్థాన్ రాష్ట్రాల్లోని బ్యాంక్ ఖాతాలకు వెళ్లాయి. వీటికి సంబంధించిన వివరాల్ని పోలీసులు సేకరిస్తున్నారు. డబ్బుల విషయంలో ఎవరిట్రాప్ లో పడొద్దన్నమాట పోలీసులు చెబుతున్నారు. ఉత్తినే డబ్బులు ఎవరూ ఇవ్వరన్న ప్రాథమిక అంశాన్ని ఏ సందర్భంలోనూ మర్చిపోకుండా ఉంటే.. సైబర్ మోసాల బారిన పడకుండా ఉండే వీలుంది.