ఆడవాళ్ల కన్నీళ్ల వాసనకు అంత శక్తి ఉంటుందట
ఎంత వారలైనా కాంతదాసులే అంటూ ఒక సామెత మనకు తెలిసిందే. చిన్నదాని వాలుచూపులకు చిత్తు కాని మగాడు ఉండరని చెబుతారు.
By: Tupaki Desk | 23 Dec 2023 4:41 AM GMTఎంత వారలైనా కాంతదాసులే అంటూ ఒక సామెత మనకు తెలిసిందే. చిన్నదాని వాలుచూపులకు చిత్తు కాని మగాడు ఉండరని చెబుతారు. వాలు చూపులే కాదు.. ఆడవారి కన్నీళ్లకు ఉండే పవర్ గురించి తాజాగా ఒక ఆసక్తికర రిపోర్టు బయటకు వచ్చింది. సాధారణంగా ఆడవాళ్లు కన్నీళ్లు కారిస్తే.. ఎంతటి మగాడికైనా చిరాకు వచ్చేస్తుంది. మరింత కోపానికి గురవుతారు. అదే సమయంలో.. మగాడి కోపాన్ని అస్సలు అంగీకరించని ఆడోళ్లు.. కన్నీళ్లను కార్చేస్తుంటారు.
అయితే.. ఆడవారి కన్నీళ్లను ఇష్టపడని మగాళ్లు.. ఆ కన్నీళ్ల వాసనకు మాత్రం బంధీలవుతారని చెబుతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ కు చెందిన శాస్త్రవేత్తలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. ఆడవారి కన్నీళ్లను పీలిస్తే.. ఎంతటి దూకుడుగా ఉండే మగవాడికైనా కళ్లాలు పడతాయని.. వారు శాంతస్వభావులుగా మారిపోతారని స్పష్టం చేస్తున్నారు.
ఆడవాళ్ల కన్నీటి వాసన.. మగవారిపై చూపించే ప్రభావంపై ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేవారు. వీజ్ మాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్ని చూస్తే.. మహిళల కన్నీళ్లలోని రసాయనాలు పురుషుడి మెదడుపై తీవ్రంగా ప్రభావితం చేస్తాయని.. అవి మగాడిలోని దూకుడు స్వభావానికి కళ్లాలు వేస్తాయని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని ప్లాస్ బయాలజీ జర్నల్ పబ్లిష్ చేసింది.