మహిళలు దుస్తులు ధరించని గ్రామం... భారత్ లోనే ఎక్కడో తెలుసా?
వివరాళ్లోకి వెళ్తే... హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లు జిల్లాలో పిని అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలోని మహిళలు అంతా ఏడాదిలో 5 రోజుల పాటు దుస్తులు లేకుండా నగ్నంగా ఉండారు.
By: Tupaki Desk | 13 Jun 2024 12:30 AM GMTప్రపంచంలో ఎన్నో ఆచార వ్యవహారాలు ఉంటాయనేది తెలిసిన విషయమే. ఒక్కో ప్రాంతంలోనూ ఒక్కో రకమైన ఆచారాలు ఉంటుంటాయి. అయితే వాటిలో కొన్ని నార్మల్ గానే అనిపిస్తే.. మరికొన్ని మాత్రం మరీ వింతగా ఉంటాయి. ఇందులో భాగంగా మనదేశంలోనే ఒక గ్రామంలో మహిళలు దుస్తులు ధరించని ఒక గ్రామం ఉంది. అది ఎక్కడ, అలా ఎందుకు అనేది ఇప్పుడు చూద్దాం...!
అవును... ఎన్నో ఆచార వ్యవహారాలున్న భారతదేశంలోని ఒక గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. ఇందులో భాగంగా ఆ గ్రామంలోని మహిళలంతా సంవత్సరంలో ఐదు రోజుల పాటు దుస్తులు ధరించకుండా నగ్నంగా ఉంటారు. ఈ సంప్రదాయం శ్రావణ మాసంలో నిర్వహించబడుతుందంట. ఈ ఐదు రోజులూ ఈ నగ్మ దీక్ష చేయడం వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉందని చెబుతుంటారట.
వివరాళ్లోకి వెళ్తే... హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లు జిల్లాలో పిని అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలోని మహిళలు అంతా ఏడాదిలో 5 రోజుల పాటు దుస్తులు లేకుండా నగ్నంగా ఉండారు. ఆ గ్రామంలో చాలా కాలం క్రితం రాక్షసులు తిరిగేవారంట. ఆ రాక్షసులు గ్రామంలోని మహిళల దుస్తులను చింపేసి తీసుకెళ్లేవారంట. అయితే... ఆ సమయలో ఒక దేవత ఆ గ్రామాన్ని రక్షించేందుకు వచ్చిందని చెబుతున్నారు.
అలా వచ్చిన ఆ దేవత... మహిళలను వేదిస్తున్న రాక్షసులను చంపి, పిని గ్రామ ప్రజలను కాపాడిందంట. దీంతో ఈ ఘటన జరిగిన రోజుగా చెబుతూ... ఐదు రోజుల పాటు దీక్షలో ఉంటారంట మహిళలు. ఇందులో భాగంగా ఐదు రోజులు దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారంట. సూర్యకాంతి, స్వచ్ఛమైన గాలి, వాతావారణంలోని సహజ వాయువులను ఆలింగనం చేసుకుంటూ పూజలు చేస్తారంట.
ఈ పూజలు చేసే మొదటి రోజునే వారు పూజిస్తున్న దేవత... ఆ ఊరిపై పడిన రాక్షసులను చంపేసిందంట. ఈ ఐదు రోజులూ ఆ గ్రామంలోని మగవారు కూడా చాలా నిష్టగా ఉంటారంట. ఇందులో భాగంగా మద్యం కానీ, మాంసం గాని ముట్టరని చెబుతున్నారు. ఇక ఈ దీక్ష జరిగే ఐదు రోజులూ ఆ ఆ గ్రామంలోకి బయటవారెవరినీ రానివ్వరని చెబుతున్నారు.